చిలకలూరిపేట నియోజకవర్గం లోని యడ్లపాడు మండలం, కొండవీడు గ్రామంలో అగ్ని హర్షిదాతు ఎమ్.ఏస్.ఎం.ఇ పార్క్ కు జిల్లా కలెక్టర్ కృత్తికా శ...
చిలకలూరిపేట నియోజకవర్గం లోని యడ్లపాడు మండలం, కొండవీడు గ్రామంలో అగ్ని హర్షిదాతు ఎమ్.ఏస్.ఎం.ఇ పార్క్ కు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా ఆమోదం తెలిపారు.
పల్నాడు జిల్లా కలెక్టర్ బంగ్లా లోని జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ ( డి.ఐ.పి.ఈ.సి) సమావేశం జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా అధ్యక్షతన జరిగింది.నానో టెక్నాలజీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి, కావలసిన అన్ని అనుమతులను కేటాయిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, పెదకూరపాడు నియోజకవర్గాలలో త్వరగా పార్కులును ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా పరిశ్రమల మరియు ప్రోత్సాహక కమిటీకి సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ జి.ఎం బి. శ్రీనివాస్ రావు, పీ.సీ పల్నాడు జిల్లా అభివృద్ధి కమిటీ జి సుబ్బారెడ్డి, అసిస్టెంట్ కమర్షియల్ ఆఫీసర్ జి. ఆనంద్ కుమార్, ఎల్.డి.ఎం రామ్ ప్రసాద్,జిల్లా రవాణా శాఖ అధికారి సంజీవ్ కుమార్, భూగర్భ జలాల అధికారి కె. రాణా బాబు రెడ్డి, జిల్లా ఫైర్ ఆఫీసర్ ఎం శ్రీనివాస్ రావు, లీగల్ మెట్రాలజీ అభివృద్ధి అధికారి జి.ఎస్ సునీల్ రాజు, లేబర్ డిపార్ట్ మెంట్ కే మహబూబ్ సుభాని, నర్సరావుపేట మున్సిపల్ అధికారి జి రవికుమార్,సిక్కి వి.రాజు తదితరులు పాల్గొన్నారు.
COMMENTS