కబాడీ పోటీలను ప్రారంభించిన మండల టిడిపి అధ్యక్షుడు కామినేని సాయిబాబు. ఎడ్లపాడు మండలం బోయపాలెం గ్రామంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా...
కబాడీ పోటీలను ప్రారంభించిన మండల టిడిపి అధ్యక్షుడు కామినేని సాయిబాబు.
ఎడ్లపాడు మండలం బోయపాలెం గ్రామంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా కబడ్డీ టోర్నమెంట్‌ను ఎడ్లపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కామినేని సాయిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. బోయపాలెం కబడ్డీ కమిటీ ఆధ్వర్యంలో, సాయిబాబు సహకారంతో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌లో 16 టీమ్‌లు పాల్గొంటున్నాయి.
మొదటి పోటీలో భగవాన్ నాదెండ్ల టీమ్‌తో చోడవరం టీమ్ మధ్య జరిగింది.రెండు టీమ్‌ల సభ్యులను పరిచయం చేసుకున్న సాయిబాబు పోటీలను ప్రారంభం చేశారు.అనంతరం మాట్లాడిన సాయిబాబు, బోయపాలెం కబడ్డీ కమిటీని అభినందించారు. పోటీదారులు స్నేహపూర్వక వాతావరణంలో, సోదర భావంతో టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎస్.కె.రాజు, ఉపాధ్యక్షుడు బద్దుల నరసయ్య, మండల మైనారిటీ అధ్యక్షుడు ఎస్.కె.బుడే, మండల కార్యదర్శి ఎస్.కె.పండు, టిడిపి నాయకులు వి.శ్రీనివాస్, ఎస్.కె.జాన్, ఎస్.కె.అల్లాబక్షు, వడ్డేపల్లి శ్రీనివాస్‌రావు, వంకదారి శివరామకృష్ణలతో కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
COMMENTS