చిలకలూరిపేట: పట్టణంలోడివిజన్-1 పరిధిలో నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని పారిశుధ్య పనులు సాగుతున్నాయి. మున్సిపల్ చైర్మన్ షే...
చిలకలూరిపేట: పట్టణంలోడివిజన్-1 పరిధిలో నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని పారిశుధ్య పనులు సాగుతున్నాయి. మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని సూచనల మేరకు, మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు ఆదేశాలతో పట్టణంలో ప్రత్యేకంగా నైట్ శానిటేషన్ (రాత్రి సమయ పారిశుధ్య పనులు) నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఇంచార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ కొత్త ఏడాది వేడుకల నేపథ్యంలో పట్టణం శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో రాత్రి సమయాల్లో కూడా సిబ్బందితో పారిశుధ్య పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ డివిజన్ పరిధిని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన పేర్కొన్నారు.
COMMENTS