పల్నాడు జిల్లాలోని వినుకొండ నియోజకవర్గం, నీల గంగవరం గ్రామంలో " మీ భూమి - మీ హక్కు" కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ మరి...
పల్నాడు జిల్లాలోని వినుకొండ నియోజకవర్గం, నీల గంగవరం గ్రామంలో " మీ భూమి - మీ హక్కు" కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ మరియు స్థానిక ఎమ్మెల్యే జీ.వి ఆంజనేయులు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, డి.సి.సి.బి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, నరసరావుపేట ఆర్డిఓ మధులత పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 90 వేలకు పైగా నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరుగుతోందన్నారు.
జిల్లాలో ఎక్కువగా ఉన్న రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం 1906 తర్వాత తిరిగి రెవెన్యూ సర్వే నిర్వహిస్తోందని, సర్వేలో ఏమైనా ఇబ్బందులు ఉంటే సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ క్లినిక్ లు ఏర్పాటు చేశామన్నారు. నియోజక వర్గంలో ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేపడతామన్నారు.
వినుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే జీ.వి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు "మీ భూమి - మీ హక్కు " అనే పథకానికి శ్రీకారం చుట్టారని, ఈ జిల్లాలో ప్రభుత్వ భూమిని, రైతుల భూముల ను మొత్తాన్ని సర్వే చేసి దానిపై ప్రభుత్వ రాజముద్ర వేసి దానిని ఆ పుస్తకాల్లో నమోదు ఇస్తున్నారన్నారు.
కేవలం వినుకొండ మండలంలోనే 6775 రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నారు అంటే ఇది కేవలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చలవేనన్నారు.
ఈ కార్యక్రమంలో డి.సి.సి.బి చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, ఆర్డిఓ మధులత, తహశీల్దార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
COMMENTS