‘ఈనాడు’ దినపత్రిక 50 ఏళ్లు ‘ఈటీవీ’ 30వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నరసరావుపేట పట్టణంలోని డా.కోడెల శివప్రసాద్ స్టేడియంలో ఆ...
‘ఈనాడు’ దినపత్రిక 50 ఏళ్లు ‘ఈటీవీ’ 30వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నరసరావుపేట పట్టణంలోని డా.కోడెల శివప్రసాద్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన వేడుకలలో చీప్ విప్ జీ.వి. ఆంజనేయులు, శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు తో కలిసి మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ.. తెలుగు అంటే గుర్తుకు వచ్చే వాటిలో ఈటీవీ, ఈనాడు ముందు వరసలో ఉంటాయన్నారు. మీడియా రంగంలో రామోజీ రావు కృషి చిరస్మరణీయం అని అన్నారు. ప్రభుతం, ప్రజల మధ్య వారధిలా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషి అభినందనీయం అని తెలిపారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో, ప్రజలను చైతన్యపరచడం లో ఈనాడు పత్రిక పాత్ర అమోఘమని కొనియాడారు.ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి అన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు నాయకులు, టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, తుబాటి శ్రీహరి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
COMMENTS