చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ సందర్భాల్లో పోయిన 12 సెల్ ఫోన్లను పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు. సాంకేతిక పర...
చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ సందర్భాల్లో పోయిన 12 సెల్ ఫోన్లను పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో గాలించి స్వాధీనం చేసుకున్న ఈ మొబైల్ ఫోన్లను, ఈరోజు చిలకలూరిపేట అర్బన్ సీఐ పి. రమేష్ బాధితులకు స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూఫోన్లు పోగొట్టుకున్న వారు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి, వాటిని ట్రాక్ చేసి రికవరీ చేశామని తెలిపారు. తమ విలువైన ఫోన్లను తిరిగి పొందిన బాధితులు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఫోన్లు పోగొట్టుకున్న వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, తద్వారా వాటిని తిరిగి పొందే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సూచించారు.
COMMENTS