చిలకలూరిపేట: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఈరోజు చిలకలూరిపేట డివిజన్ విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో ఇం'ధనం' పొదుప...
చిలకలూరిపేట: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఈరోజు చిలకలూరిపేట డివిజన్ విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో ఇం'ధనం' పొదుపు చేద్దాం భావితరాలకు వెలుగునిద్దాం అనే నినాదంతో విద్యుత్ అధికారులు అందరూ ఈ ఆర్ ఓ ఆఫీసు నుండి గడియార స్తంభం వరకు ర్యాలీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై. ఏడుకొండలు , డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్. అశోక్ కుమార్ మరియు విద్యుత్ శాఖ ఏ ఈ లు, సిబ్బంది పాల్గొనడం జరిగినది.ది.14.12.25 నుండి 20.12.25 జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు ఇంధనమును పొదుపు చేద్దాము భావితరాలకు వెలుగునిద్దాము అనే వినాదముతో మహోద్యముతో విద్యుత్ పొదుపును తీర్చిదిద్దుదాము 1.అవసరం లేనీ చోట్ల ఫ్యాన్, లైట్లు స్విచ్ లు ఆఫ్ చేద్దాము. 2.. మూడు కంటే ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్న విద్యుత్ పరికరాలు వాడడము ద్వారా విద్యుత్ ఆదా చేసుకోవచ్చు. 3. గీజర్ , వాటర్ మోటార్ కు సోలార్ విద్యుత్ వినియోగించుకొని విద్యుత్ ను ఆదా చేసుకోవచ్చు.
4. సెల్ ఫోన్ ఛార్జర్, మరియు టీవీ రిమోట్ ఒక్కటే ఆఫ్ చేయకుండా విద్యుత్ స్విచ్ ను కూడా ఆఫ్ చేసి విద్యుత్ ను ఆదా చేసుకోవచ్చు.
ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన.
మనకు ఉన్న వనరులన్ని తగ్గిపోతున్న కారణంగా రాబోవు రోజుల్లో విద్యుత్ ఉత్పత్తి కి ఇబ్బంది రాకుండా ప్రధానమంత్రి ప్రవేశ పెట్టిన సూర్యా ఘర్ యోజన పథకం కింద ఉన్న రాయితీతో ప్రతి ఒక్కరు సోలార్ విద్యుత్ వినియోగించుకొని భావి తరాలకు బంగారు బాట వేయాలి.
స్మార్ట్ మీటర్....
విద్యుత్ విభాగములో స్మార్ట్ సిటీ కింద చిలకలూరిపేట గుర్తింపు పొందినందున స్మార్ట్ మీటర్లు మా సిబ్బంది మారుస్తున్నారు దానివల్ల బిల్లులు ఎక్కువ వస్థాయని అపోహలు అవసరం లేదు మనం వినియోగించుకున్న విద్యుత్ వివరాలు ప్రతి రోజు www.apcpdcl.in సైట్ లో ఉన్న యాప్ ను డౌన్లోడ్ చేసుకొన్నట్లైతే మీరే పరిశీలించుకోవచ్చు
అదనం లోడ్ క్రమబద్ధీకరణ....
విద్యుత్ సర్వీసులకు అదనపు లోడు పెంచుకొనుటకు విద్యుత్ శాఖ వారు కిలోవాట్ కు డెవోలోప్మెంట్ చార్జిలలో 50% రాయితీ 31-12-25 లోపు అనగా ఈ నెల చివరి వరకు మాత్రమే గడువు వున్నది.కనుక మీరు తీసుకొన్న లోడ్ కంటే అధిక లోడు వాడుచున్నచో సమీపంలో వున్న విద్యుత్ రెవిన్యూ కార్యాలయమునందు సంప్రదించి అదనపు లోడులో వున్న డెవోలోప్మెంట్ చార్జీ లో 50%రాయితితో లోడుని క్రమబద్దించుకోవాలి.మీకు విద్యుత్ ఓల్టేజ్,స్తంభాల, లైన్ల సమస్యలు ఏదైనా ఉన్న యెడల వెంటనే సంబంధిత ఏఈ ల ను సంప్రదించినచో త్వరతిగతిన పరిష్కరించగలరు.మీకు ఏదైనా సలహాలు సూచనలకు నేరుగా టిడ్కో గృహాల వద్ద ఉన్న కార్యాలయం లో నన్ను సంప్రదించవచ్చని చిలకలూరిపేట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై. ఏడుకొండలు తెలిపారు.
COMMENTS