రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి షేక్ మస్తాన్ వలి చేతుల మీదుగా వృద్ధులకు అన్నదానం చిలకలూరిపేట: ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వ...
రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి షేక్ మస్తాన్ వలి చేతుల మీదుగా వృద్ధులకు అన్నదానం
చిలకలూరిపేట: ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) కుటుంబ సభ్యులు పట్టణంలోని ప్రశాంతి వృద్ధాశ్రమంలో ఒక ముఖ్యమైన సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.కుటుంబ సభ్యులలో ఒకరు తమ అమ్మమ్మ జ్ఞాపకార్థంగా వృద్ధులకు అన్నదానం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి షేక్ మస్తాన్ వలి హాజరై,తమ చేతుల మీదుగా వృద్ధులకు అన్నదానంచేశారు.ఈ సందర్భంగా షేక్ మస్తాన్ వలి మాట్లాడుతూ వృద్ధుల పట్ల ప్రేమ జీవితంలో విలువైన అనుభవాలను, ఆశీర్వాదాలను అందించే వృద్ధులకు సేవ చేయడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయనఉద్ఘాటించారు.కేవలం వృత్తి పరమైనబాధ్యతలతో పాటు, ఏపీయూడబ్ల్యూజే కుటుంబ సభ్యులు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయం అని కొనియాడారు. తమ అమ్మమ్మ జ్ఞాపకార్థం ఒక మంచి కార్యక్రమం ద్వారా ఇతరుల ఆకలి తీర్చడానికి కృషి చేసిన కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే పల్నాడు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అడపా అశోక్ కుమార్, సెక్రటరీ షేక్ దరియావలి గూడూరు సుబ్బు, కొచ్చర్ల చందు, ఎన్ శ్రీకాంత్, పెనుమల మనోహర్, సభ్యులు వృద్ధాశ్రమం నిర్వాహకులు మరియు పలువురు పాల్గొన్నారు.
COMMENTS