నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ. చిలకలూరిపేట: రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, సుల్తానా రజియా, సరోజినీ న...
నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ.
చిలకలూరిపేట: రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, సుల్తానా రజియా, సరోజినీ నాయుడు, ఇందిరా గాంధీ ల కోవలో దేశ ప్రజల హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించి కోట్లాదిమంది పేద ప్రజలతో అమ్మా అని పిలిపించుకున్న ఆదర్శ మహిళా మూర్తి శ్రీమతి సోనియా గాంధీ అని చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త
ఎం రాధాకృష్ణ అన్నారు. ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు, పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి సోనియా గాంధీ 79వ జన్మదినం చిలకలూరిపేటలో కళాశాల విద్యార్థినుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సోనియాగాంధీ జన్మదిన కేకును కాలేజీ విద్యార్థినులతో కలిసి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ కరీమున్ కట్ చేసి విద్యార్థినులకు తినిపించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థినులకు ప్రయోజనకరమైన వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే పుస్తకాలను పంపిణీ చేశారు. రాష్ట్ర బాలల రచయిత డాక్టర్ దార్ల బుజ్జిబాబు రచించిన పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ మహిళలు ఏ అంశంలోనూ పురుషులకు తీసిపోరని అన్ని రంగాలలో పురుషుల కన్నా మిన్నగా రాణిస్తూ దేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచపు అంచులకు చేరుస్తున్నారని మహిళా శక్తిని కొనియాడారు. ప్రతి విద్యార్థిని కష్టపడి చదివి గురువులు నిర్దేశించిన మార్గనిర్దేశంలో ప్రణాళిక బద్ధంగా కృషి చేయడం ద్వారా తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు తాము విద్యను అభ్యసించిన కళాశాలకు తమ జన్మభూమికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ నస్రుద్దీన్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షేక్ కరిమున్, జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు జాస్తి నాగ ఆంజనేయులు, నాదెండ్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ బాజీ, ఎడ్లపాడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, సాగి నరసింహారావు జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంటూరి భవాని వెంకటేష్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కారుచోల స్వప్న కుమార్ షేక్ సుభాని,శానం అరుణ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి పిచ్చయ్య చారి, మైనారిటీ సెల్ జిల్లా కార్యదర్శి షేక్ పోతవరం మహమ్మద్ గౌస్ భారత జాతీయ విద్యార్థి సంఘం నాయకులు షేక్ జానీ, మంచా పరిమల్, మురుగుల రవి కుమార్, బీసీ నాయకులు నాంపల్లి శ్రీనివాసరావు మంగళగిరి శ్రీనివాసరావు అన్నలదాసు డేవిడ్
కే శ్రీనివాసరావు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు విద్యార్థినులు పాల్గొన్నారు.
COMMENTS