చిలకలూరిపేట: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలోని మున్సిపల్ చైర్మన్ ఛాంబర్‌లో మున్సిపల్ చైర్మన్ రఫాని విలేకరుల సమావేశం నిర్వహించార...
చిలకలూరిపేట: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలోని మున్సిపల్ చైర్మన్ ఛాంబర్‌లో మున్సిపల్ చైర్మన్ రఫాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టిడ్కో గృహ సముదాయాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం మున్సిపాలిటీ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు లబ్ధిదారులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని చైర్మన్ తెలిపారు. ముఖ్యంగా, టిడ్కో గృహాల్లో విద్యుత్ సరఫరా చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే అక్కడ బడి, గుడి, ఆసుపత్రి ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని ప్రకటించారు. ఇప్పటికే 500 గృహాలకు సంబంధించి బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించామని తెలిపారు. కాగా, ఈ నెల 16వ తేదీన టిడ్కో గృహాల సముదాయంలో లబ్ధిదారులకు సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, ఈ సమావేశంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని చైర్మన్ పిలుపునిచ్చారు. లబ్ధిదారులు తమ గృహాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా వారిపై ఉందని చైర్మన్ రఫాని ఈ సందర్భంగా సూచించారు.
COMMENTS