చిలకలూరిపేట: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెల రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిపే సమావేశం గురువారం ఉదయం పేట తహసీల్దారు క...
చిలకలూరిపేట: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెల రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిపే సమావేశం గురువారం ఉదయం పేట తహసీల్దారు కార్యాలయంలో జరిగింది.ఓటరు జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియలో భాగంగా 18 సంవత్సరాలు నిండిన వారిని నూతన ఓటర్లుగా చేర్పించాలని, అలాగే చనిపోయిన ఓటర్ల వివరాలు, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్ల వివరాలు ఎప్పటికప్పుడు రాజకీయ పక్షాల ప్రతినిధులు స్థానిక BLO లకు అందించాలని పేట తహశీల్దార్ హుస్సేన్ పార్టీ ప్రతినిధులను కోరారు.స్థానిక పార్టీ ప్రతినిధుల సహకారంతో ఓటరు జాబితా స్వచ్చీకరణ సాధ్యపడుతుందని, అలాగే 1200 ఓటర్లు పైబడిన పోలింగ్ బూత్ లను విభజించే ప్రక్రియ కూడా పూర్తి అయిందని, 2002 ఓటర్ల జాబితా తో ప్రస్తుత జాబితా మ్యాపింగ్ చేసే కార్యక్రమం కూడా దాదాపు పూర్తి అయిందని తెలిపారు. సమావేశంలో పార్టీల ప్రతినిధులు మురకొండ మల్లి బాబు, షేక్ అజహారుద్దీన్, విడదల శ్రీనివాసరావు,యం. రాధాకృష్ణా, రావు సుబ్రహ్మణ్యం,సాంబశివరావు తదితరులు పాల్గొనడం జరిగింది.
COMMENTS