అన్ రిజర్వ్ టికెట్లపై రాయితీ జనవరి 14 నుంచి జులై 14 వరకు... రైళ్లలో అన్ రిజర్వుడ్ టికెట్లను రైల్ వన్ యాప్ ద్వారా కొని డిజిటల్ వి...
అన్ రిజర్వ్ టికెట్లపై రాయితీ జనవరి 14 నుంచి జులై 14 వరకు...
రైళ్లలో అన్ రిజర్వుడ్ టికెట్లను రైల్ వన్ యాప్ ద్వారా కొని డిజిటల్ విధానంలో చెల్లింపులు చేసేవారికి 3% రాయితీని రైల్వే మంత్రిత్వశాఖ ఇవ్వనుంది. 2026 జనవరి 14 నుంచి జులై 14 వరకు ఇది అమల్లో ఉంటుంది. ఈ యాప్ ద్వారా ఆర్-వ్యాలెట్తో చెల్లింపుల్ని చేసేవారికే ప్రస్తుతం ఈ రాయితీని క్యాష్ బ్యాక్ రూపంలో ఇస్తోంది. డిజిటల్ బుకింగ్లను ప్రోత్సహించడానికి ఈ యాప్ ద్వారా జరిగే అన్నిరకాల డిజిటల్ చెల్లింపులకు దీనిని విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. సంబంధిత సాఫ్ట్వేర్లో తగిన మార్పులు చేయాలని 'రైల్వే సమాచార వ్యవస్థ కేంద్రం (క్రిస్)కు మంగళవారం రైల్వేశాఖ ఆదే శాలిచ్చింది. ప్రయాణికుల స్పందన ఎలా ఉందో మే నెలలో తెలియజేస్తే దీనిపై తదుపరి పరిశీలన చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది.ఆర్-వ్యాలెట్ ద్వారా ఇప్పటికే ఉన్న రాయితీ కొనసాగుతుందని స్పష్టంచేసింది.ఇతర ఏ ఆన్లైన్ విధానాల్లో కొన్న అన్ రిజర్వ్ టికెట్లకు వర్తించబోదని తేల్చిచెప్పింది.
COMMENTS