చిలకలూరిపేట: పట్టణంలో మాజీ మంత్రి,ప్రస్తుత శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు 25వ వార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ...
చిలకలూరిపేట: పట్టణంలో మాజీ మంత్రి,ప్రస్తుత శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు 25వ వార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు వార్డు కౌన్సిలర్ తోట నాగలక్ష్మి మరియు తోట వెంకట సురేష్ చేతుల మీదుగా పింఛన్లు అందజేయడం జరిగింది.ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని తోట సురేష్ తెలిపారు. వార్డు ప్రజలు ఈ కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
COMMENTS