ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల గృహ నిర్మాణాలు పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని బుధవారం చిలకలూరిపేట పట్టణంలో ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల గృహ నిర్మాణాలు పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని బుధవారం చిలకలూరిపేట పట్టణంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి లబ్ధిదారులకు గృహనిర్మాణ మంజూరు ఉత్తర్వుల పత్రాలను అందజేశారు.కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం గృహ నిర్మాణం ద్వారా నిరుపేదకుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేస్తోందని తెలిపారు.గృహాల నిర్మాణం నాణ్యతతో పూర్తి చేయడాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.లబ్ధిదారులు తమ కొత్త ఇళ్లను ప్రేమతో, స్వచ్ఛతతో సంరక్షించాలని సూచించారు.
అనంతరం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన 'పేదల గృహ నిర్మాణ కార్యాక్రమం' ఎంతో పేదలను ఆశావహులను చేసిందన్నారు. గతంలో కేవలం కలగా ఉన్న సొంత ఇల్లు, ఇప్పుడు ప్రతి సాధారణ కుటుంబానికి వాస్తవమవుతోందన్నారు. చిలకలూరిపేటలో మాత్రమే వందలాది లబ్ధిదారులు తమ ఇళ్లను సొంతం చేసుకుంటున్నారని తెలిపారు.అంతేకాకుండా,రాబోవు నెలల్లో గృహాలకు అవసరమైన మౌలిక సదుపాయాల పనులువేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు,గృహ లబ్ధిదారులు పాల్గొన్నారు.
COMMENTS