చిలకలూరిపేట: పురపాలక సంఘ కౌన్సిల్ హాల్లో శుక్రవారం ఘన వ్యర్థ నిర్వహణపై సామర్థ్య వృద్ధి శిక్షణా కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమాన...
చిలకలూరిపేట: పురపాలక సంఘ కౌన్సిల్ హాల్లో శుక్రవారం ఘన వ్యర్థ నిర్వహణపై సామర్థ్య వృద్ధి శిక్షణా కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమాన్ని AIILSG విజయవాడ మరియు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సంయుక్తంగా మెప్మా ఆర్పి ల కోసం నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ షేక్ రఫ్ఫాని హాజరై మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించేందుకు అవసరమైన అవగాహన, నైపుణ్యాలను పెంపొందించడం ఈ శిక్షణా కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు.శిక్షణలో భాగంగా సోర్స్ సెగ్రిగేషన్, హోమ్ కంపోస్టింగ్, టెర్రస్ గార్డెనింగ్, బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్ (BCC) అంశాలపై నిపుణులు సూచనలు ఇచ్చారు.ఇంటి వద్దనే వ్యర్థాలను వేరుచేసే అలవాటు, సేంద్రీయ వ్యర్థాల వినియోగం, పర్యావరణ అనుకూల జీవన విధానాల ప్రాధాన్యాన్ని పాల్గొన్నవారికి వివరించారు.ఈ సందర్భంగా చిలకలూరిపేట మున్సిపాలిటీ చైర్మన్ షేక్ రఫ్ఫాని నగరాన్ని అధికారికంగా ‘ప్లాస్టిక్ ఫ్రీ జోన్’గా ప్రకటించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే దిశగా, AIILSG సంస్థ తరఫున మున్సిపల్ కమిషనర్, చైర్మన్ మరియు సిబ్బందికి స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
COMMENTS