పల్నాడు: సహకార శాఖ కార్యకలాపాల పై సమీక్షా సమావేశం నిర్వహించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా...
పల్నాడు: సహకార శాఖ కార్యకలాపాల పై సమీక్షా సమావేశం నిర్వహించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా సహకార అభివృద్ధి కమిటి అద్వర్యంలో పలువిషయాలు చర్చించటం జరిగింది. దానిలో బాగంగా బహుళ ప్రయోజన సౌకర్యాల కేంద్రం (ఎంపిఎఫ్సి) గోడౌన్లు, ప్రాధమిక వ్యవసాయ సంఘాలు కంప్యూటరీకరణ, ప్రాధమిక వ్యవసాయ సంఘాలు ద్వారా పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాట్లు, పల్నాడు జిల్లా అభివృద్ధి మరియు ప్రాధమిక వ్యవసాయ సంఘాల ద్వారా కోల్డ్ స్టోరేజీల నిర్మాణం కోసం ప్రతిపాదిత 5 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక, ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాల ఏర్పాటు, సాధారణ సేవా కేంద్రాలు మరియు ప్రతి సంఘములో మృత్తిక పరీక్షా కేంద్రముల (సోయిల్ టెస్టింగ్ సెంటర్స్) ఏర్పాటు, ప్రాధమిక వ్యవసాయ సంఘాల ద్వారా పనిచేయడానికి గ్యాస్ ఏజెన్సీ, ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన అమలు, కారుమంచి ప్రాధమిక వ్యవసాయ సంఘ౦ ధాన్యం నిల్వ గోడౌన్, బహుళార్ధసాధక సౌకర్యాల సేవా కేంద్రాల గోడౌన్లను, జాతీయ సహకార డేటాబేస్‌లో డేటాను అప్‌లోడ్ చేయడం, వ్యవసాయ మరియు వ్యవసాయేతర రుణాలు, ఆడిట్ స్థితి మరియు శాఖాపరమైన కార్యక్రమాలు ఫై చర్చించడం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా సహకార అధికారి ఎం.నాగరాజు, డివిజనల్ కోపరేటివ్ ఆఫీసర్ తిరుపతయ్య, జిల్లా పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వర్ నాయక్, జిల్లా మత్స్యశాఖ అధికారి ఎస్.ఈ, పంచాయత్ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, జిల్లా అభివృద్ధి మేనేజర్ (డిడిఎం), నాబార్డ్, గుంటూరు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జిడిసిసి బ్యాంక్ లిమిటెడ్, గుంటూరు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, ఏడి మార్కెటింగ్ మరియు డి.ఆర్.డి.ఏ పిడి ఝాన్సీ రాణి తదితరులు పాల్గొన్నారు.
COMMENTS