చిలకలూరిపేట: మోంథా తుఫాన్ సమయంలో ప్రజలకు అత్యవసర సేవలను అందించిన అధికారులు, సిబ్బందిని ప్రోత్సహిస్తూ కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ...
చిలకలూరిపేట:
మోంథా తుఫాన్ సమయంలో ప్రజలకు అత్యవసర సేవలను అందించిన అధికారులు, సిబ్బందిని ప్రోత్సహిస్తూ కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు అభినందన సభ జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.తుఫాన్ సమయంలో వేగంగా స్పందించి,పట్టుదలతో సేవలందించిన చిలకలూరిపేట ఎమ్మార్వో షేక్ మహమ్మద్ హుస్సేన్‌ను కలెక్టర్ కృతికా శుక్లా సత్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విపత్తు సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడడంలో ప్రభుత్వ సిబ్బంది చూపిన చురుకుదనం ప్రశంసనీయమని తెలిపారు.భవిష్యత్తులో కూడా అదే నిబద్ధతతో ప్రజా సేవలను అందించాలని ఆమె సూచించారు.తుఫాన్ సమయంలో సమన్వయంతో పనిచేసిన అధికారులందరికీ ప్రశంసలు అందజేయడంతో పాటు,విపత్తు నిర్వహణలో చిలకలూరిపేట మండల యంత్రాంగం కీలక పాత్ర పోషించిందని కలెక్టర్ అభినందించారు.
COMMENTS