పల్నాడు జిల్లాలో రైతులు ప్రాంతాలను బట్టి క్లస్టర్ విధానంలో పంటలు సాగు చేయడం ద్వారా రైతులు మంచి లాభాలు అర్జించవచ్చని జిల్లా కలెక్...
పల్నాడు జిల్లాలో రైతులు ప్రాంతాలను బట్టి క్లస్టర్ విధానంలో పంటలు సాగు చేయడం ద్వారా రైతులు మంచి లాభాలు అర్జించవచ్చని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అన్నారు.శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో ఎస్సీ, ఎస్టీ ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంనిర్వహించారు.
కార్యక్రమంలో ఎఫ్పీవో రైతులకు మునగ విత్తనాలు, సంక్షేమ హాస్టళ్లకు కంప్యూటర్లు, దుప్పట్లు పంపిణీ చేశారు.ఎఫ్పీవో రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక పంట ఉత్పత్తి నుంచి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ వరకూ అన్నీ ఒకే ప్రాంతంలో అందుబాటులో ఉండటం వల్ల రైతులకు, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుందన్నారు. రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తే దీర్ఘకాలంలో మెరుగైన లాభాలు దక్కుతాయన్నారు.
ఎఫ్ పీవో రైతులకు మునగ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకునేందుకు భూమి, సబ్సిడీలో రుణాలు అందిస్తామన్నారు. విత్తనాల పంపిణీతో సరిపెట్టకూడదని, పది కాలాల పాటూ రైతులకు ఆదాయాన్నిచ్చే వనరుగా మునగ సాగును అభివృద్ధి చేసేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
వసతి గృహాలకు కంప్యూటర్లు, దుప్పట్ల పంపిణీ..
అనంతరం సీఎస్సార్ నిధులతో ఇన్ఫోసిస్ అందజేసిన ద్వారా కంప్యూటర్లు, దుప్పట్లను సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. వసతి గృహాల్లో విద్యార్థులకు కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.ఎస్సీ, ఎస్టీ పరిష్కార వేదికకు అందిన 11 అర్జీలకు సత్వర పరిష్కారాలు చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీఆర్వో మురళి, డీఆర్ డీవో పీడీ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
COMMENTS