చిలకలూరిపేట: పట్టణంలో ఉన్న ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం గుర్రాల చా...
చిలకలూరిపేట: పట్టణంలో ఉన్న ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం గుర్రాల చావడి వద్ద 2కె రన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, పురపాలక సంఘ చైర్మన్ షేక్ రఫాని, అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.రమేష్, కల్పతరువు చిట్స్ ప్రతినిధి పఠాన్ జాఫర్ ఖాన్, బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ చైర్మన్ ఎం.కే.ఎస్ మొహిద్దిన్, లక్కీ రోడ్ లైన్స్ ఈసుబ్ వలి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వేటపాలెం సుభాని, వైసీపి మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ జమీర్, టిడిపి నాయకుడు సయ్యద్ రఫీ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ రమేష్ మాట్లాడుతూ విద్యార్థులకు, తల్లిదండ్రులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారుల రక్షణ, బాలికల భద్రత, మొబైల్ ఫోన్ వినియోగ నియంత్రణ మరియు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించుకోవడం 2కె రన్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా మాట్లాడుతూ మొబైల్ ఫోన్ బానిసత్వం వల్ల చిన్నారుల ప్రవర్తనలో కనిపిస్తున్న మార్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక బాధ్యతగా పాత్రికేయులు, విద్యాసంస్థలు కలిసి బాలల సంరక్షణ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇటువంటి సామాజిక కార్యక్రమాలు సమాజాభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.ఆక్స్ఫర్డ్ స్కూల్ చైర్మన్ హనీఫ్ మాట్లాడుతూ విద్యార్థులకు, తల్లిదండ్రులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, చిన్నారుల్లో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన పెంపొందించటం, మొబైల్ దుర్వినియోగం నుండి వారిని దూరంగా ఉంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షన్నర మంది మైనర్లు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని, తల్లిదండ్రులు పిల్లలపై నిరంతర పర్యవేక్షణ వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
COMMENTS