ఎడ్లపాడు: మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు వందేమాతర గీతం రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎడ్లపాడు మండలంలో ...
ఎడ్లపాడు: మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు వందేమాతర గీతం రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎడ్లపాడు మండలంలో ఘనంగా కార్యక్రమం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాలతో,పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ సూచనలతో వంకాయలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఉదయం 8 గంటలకు ఈ వేడుకను నిర్వహించారు.పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రభాకర్ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులు వందేమాతర గీతం 150వవార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు వందేమాతరం గీతం స్వాతంత్ర్య ఉద్యమంలో పోషించిన ప్రేరణాత్మక పాత్రను స్మరించారు.ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా‘ఇంటింటా స్వదేశీ’ కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రతి ఇంటి స్వదేశీ ప్రతిజ్ఞ పత్రాలను విద్యార్థులచేత భర్తీ చేయించారు.మొత్తం 390 మంది విద్యార్థులు స్వదేశీ ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు తులాబందుల సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకటేశ్వరరాజు, యువ మోర్చా అధ్యక్షులు మల్లా కోటేశ్వరరావు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు బందెల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
COMMENTS