రీసర్వే, మ్యాటిషన్ల పై జాయింట్ కలెక్టర్ సూరజ్ సమీక్ష.. పెండింగ్ భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, సర్వే అ...
రీసర్వే, మ్యాటిషన్ల పై జాయింట్ కలెక్టర్ సూరజ్ సమీక్ష..
పెండింగ్ భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, సర్వే అధికారులను జాయింట్ కలెక్టర్ సూరజ్ ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రీసర్వే మూడో విడత ప్రక్రియపై మండల సర్వేయర్లతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సూరజ్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పెండింగ్ లో ఉన్న భూసంబంధిత రీసర్వేలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. భూ సమస్యలను పరిష్కరించి ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ఫిర్యాదులపై అత్యంత శ్రద్దవహించి పరిష్కరించాలన్నారు.అసైన్డ్ భూములు,ఇనాం భూములు, మ్యాటిషన్ కన్వర్షన్, సబ్ డివిజన్స్,ఎఫ్ లైన్ పిటిషన్ వ్యవసాయ భూములు మార్పులు వంటి విషయాలపై సుదీర్ఘంగా చర్చించి పలు సలహాలు అందజేసారు.
రీసర్వే మూడో విడత ప్రక్రియలో భాగంలో 44 రోజుల్లో, గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి చేయాలన్నారు. అక్టోబర్ 3న ప్రారంభమైన మూడో విడత రీసర్వే ప్రక్రియలో ఇప్పటివరకు 25 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి చేసామని జిల్లా సర్వే అధికారిణి భాను కీర్తి తెలియజేసారు.
COMMENTS