ఎడ్లపాడు: మొంథా తుఫాన్ కారణంగా కురిసిన తీవ్ర వర్షాలతో ఎడ్లపాడు మండలంలోని లింగరావుపాలెం గ్రామం జగనన్న లేఅవుట్ లో లోతట్టు ప్రాంతాల...
ఎడ్లపాడు: మొంథా తుఫాన్ కారణంగా కురిసిన తీవ్ర వర్షాలతో ఎడ్లపాడు మండలంలోని లింగరావుపాలెం గ్రామం జగనన్న లేఅవుట్ లో లోతట్టు ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. ఈ కారణంగా అక్కడ నివసిస్తున్న ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని నిర్ణయించిన బీజేపీ ఎడ్లపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో పండ్లు,బిస్కెట్లు,నీటి సీసాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
గ్రామ ప్రజలను పరామర్శించిన రెవెన్యూ అధికారి అనూష మాట్లాడుతూ, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకునేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు తులాబందుల సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకటేశ్వరరాజు, బీజేవైఎం అధ్యక్షుడు మల్లా కోటేశ్వరరావు,ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బందెల శ్రీనివాసరావు,నక్క వెంకట దుర్గ,కొండా సాంబశివరావు, చక్క ఆంజనేయులు, రావూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు తోకల రాజేష్ కూడా పాల్గొని బాధితులకు సహాయార్థం బీజేపీ కార్యక్రమానికి మద్దతు తెలిపారు.
COMMENTS