చిలకలూరిపేట మండల పరిధిలో ముందస్తు జాగ్రత్తగా పలు చర్యలు చేపట్టడంతో పాటు రెవిన్యూ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు తా...
చిలకలూరిపేట మండల పరిధిలో ముందస్తు జాగ్రత్తగా పలు చర్యలు చేపట్టడంతో పాటు రెవిన్యూ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు తాసిల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా పట్టణం నుంచి వేలూరు గ్రామం వెళ్లే దారిలో ఉన్న చప్టా మునిగిపోయే ప్రమాదం ఉందని ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రవాహం పెరిగిన వెంటనే రాకపోకలు నియంత్రణ చేసే విధంగా చర్యలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు. అదేవిధంగా నరసరావుపేట నుంచి కమ్మవారిపాలెం వెళ్లే మార్గంలో లో లెవెల్ చప్టా ఉన్నట్టు అక్కడ కూడా ఇదే విధంగా చర్యలు చేపట్టినట్టు తాసిల్దార్ తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజలు కూడా తగు జాగ్రత్తలు చేపట్టాలని అవసరమైతే కంట్రోల్ రూమ్ కు గాని 9849904025 కు ఫోన్ చేసి సహాయకు చర్యలు పొందాలని తాసిల్దార్ తెలిపారు.
COMMENTS