చిలకలూరిపేట రూరల్ పరిధిలో దీపావళి పండుగ సందర్భంగా అనుమతులు లేకుండా అవాయి సుల (బాణసంచా) తయారు చేస్తున్న ఒక దుకాణంపై చిలకలూరిపేట ర...
చిలకలూరిపేట రూరల్ పరిధిలో దీపావళి పండుగ సందర్భంగా అనుమతులు లేకుండా అవాయి సుల (బాణసంచా) తయారు చేస్తున్న ఒక దుకాణంపై చిలకలూరిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు దీపావళికి సంబంధించిన మందుగుండు సామాగ్రిని తయారు చేయాలంటే తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. అయితే, దీనికి విరుద్ధంగా, రూరల్ పరిధిలోని ఒక దుకాణంలో ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండానే బాణసంచా తయారీ జరుగుతోందని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.ఈ సమాచారం మేరకు రూరల్ పోలీసులు సదరు దుకాణంపై దాడి చేసి, అవాయి సుల తయారు చేస్తున్న వారిని పట్టుకున్నారు. అనుమతులు లేకుండా మందుగుండు సామాగ్రిని తయారు చేయడం చట్టరీత్యా నేరం కావడంతో, పోలీసులు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
COMMENTS