చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రమైన కొండవీడు కోట అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపండి : మాజీమంత్రి ప్రత్తిపాటి. ని...
చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రమైన కొండవీడు కోట అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపండి : మాజీమంత్రి ప్రత్తిపాటి.
నియోజకవర్గ అభివృద్ధి.. కొండవీడు కోటకు పూర్వవైభవం అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించిన మాజీమంత్రి ప్రత్తిపాటి.
చిలకలూరిపేట: ప్రఖ్యాత చారిత్రక ప్రదేశమైన కొండవీడు కోటను అభివృద్ధి చేయడంద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి ఎనలేని మేలు కలుగుతుందని, టెంపుల్ టూరిజానికి మంచి కేంద్రబిందువు కాగలదని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తెలియచేశారు. మంగళవారం సాయంత్రం ఆయన సచివాలయంలో మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిసి, నియోజకవర్గ మరియు కొండవీడుకోట అభివృద్ధిపై చర్చించారు. రూ.100 కోట్ల అంచనా వ్యయంతో కొండవీడు అభివృద్ధికి చేపట్టాల్సిన పలు అంశాలను పొందుపరిచిన వినతిపత్రాన్ని ప్రత్తిపాటి, ముఖ్యమంత్రికి అందించారు. గతంలో కొండవీడు కోట అభివృద్ధిపై కేంద్రమంత్రి గజేంధ్ర సింగ్ షెకావత్ ను కలిసి తెలియచేసిన అంశాలను సీఎంకు వివరించిన ప్రత్తిపాటి.. పర్యాటకాభివృద్ధి కోసం కేంద్రం చేపట్టిన ఎస్.ఏ.ఎస్.సీ.ఐ, స్వదేశీ దర్శన్ పథకాల్లో కొండవీడు ప్రాజెక్ట్ ను చేర్చడంలో ప్రత్యేక చొరవచూపాలని ప్రత్తిపాటి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతికి చేరువలోఉన్న ప్రముఖ ప్రాంతమైన కొండవీడు ఎకో టూరిజం అభివృద్ధికి కేంద్ర బిందువుగా నిలుస్తుందని చెప్పిన ప్రత్తిపాటి.. కోట ప్రాశస్త్యం.. వైభవం.. భౌగోళిక పరిస్థితులు.. అభివృద్ధి అవకాశాలను వివరిస్తూ రూపొందించిన సమగ్ర నివేదికను ముఖ్యమంత్రికి అందించారు.
2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చి, కొండవీడును అసాంఘిక కార్యకలపాల అడ్డాగా మార్చిందని, దానివల్ల కోట ప్రాశస్త్యం,వైభవం మసకబారిందని ప్రత్తిపాటి ముఖ్యమంత్రికి తెలియచేశారు. టీడీపీ హాయాంలో వేసిన ఘాట్ రోడ్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదని, వైసీపీహాయాంలో మొక్కుబడిగా ప్రారంభించిన పనులన్నీ కంపచెట్లు, రాళ్ల పాలయ్యాయని చెప్పారు. నియోజకవర్గ సమస్యల్ని ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరించాలని, ముఖ్యంగా రైతాంగానికి మేలు చేసే ఎత్తిపోతల పథకాల సామర్థ్యం పెంపునకు సరిపడా నిధులు కేటాయించి, నియోజకవర్గంలో సాగు విస్తీర్ణం పెంపునకు సహకరించాలని ప్రత్తిపాటి సీఎంను కోరారు. నీటి లభ్యతతో నియోజకవర్గంలో ఉద్యాన పంటల సాగుపెరిగి, ఆదాయం సమకూరి రైతాంగానికి మేలు జరుగుతుందని. ఈ అంశాన్ని పరిశీలించాలని ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. టిడ్కో గృహాల్లో మౌలిక వసతుల కల్పన పూర్తయిందని, రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే గృహ ప్రవేశాల వేడుక నాటికి సర్వహంగులతో నివాసాల్ని సిద్ధం చేస్తామని ప్రత్తిపాటి సీఎంకు తెలియచేశారు. కంపెనీల హామీతో గతేడాది నియోజకవర్గ రైతాంగం విరివిగా పొగాకు సాగు చేసిందని, ప్రభుత్వం చేపట్టిన కొనుగోళ్ల ప్రక్రియ వల్ల అందరికీ న్యాయం జరగలేదని, సమస్యను పరిశీలించి చిలకలూరిపేటసహా పొగాకు సాగు అయిన నియోజకవర్గ రైతాంగానికి న్యాయం చేయాలని ప్రత్తిపాటి ముఖ్యమంత్రిని కోరారు.
COMMENTS