పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు గురువారం ఉదయం నరసరావుపేట తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ...
పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు గురువారం ఉదయం నరసరావుపేట తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.
కార్యాలయం మొత్తంలో ఉన్న రికార్డుల నిర్వహణ గురించి ఆర్.డీ.వో మధులత, తహశీల్దార్ వేణు గోపాల్ ను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ రికార్డులను భద్రపరిచేందుకు ఆధునిక పద్ధతులు పాటించాలని ఆదేశించారు.
అక్కడ నుండి పల్నాడు జిల్లా ఎస్పీ కంచి. శ్రీనివాసరావుతో కలిసి నరసరావుపేట జైలును తనిఖీ చేశారు.ఖైదీలతో ముచ్చటించి జైల్లో వసతులు,మెనూ ప్రకారం భోజనం అందించడంపై వివరాలు తెలుసుకున్నారు.
సబ్ జైలు అధికారులు ఖైదీల హక్కులకు భంగం వాటిల్లకుండా మసలుకోవాలన్నారు. ఖైదీలు సత్ప్రవర్తనవైపు నడిచేలా జైల్లో కార్యక్రమాలు నిర్వహించాలని, జైలు జీవితం అనంతరం మంచి ఉపాధి పొందేలా నైపుణ్య శిక్షణ అందించాలన్నారు.
COMMENTS