ఉపాధి హామీ పథకం శ్రామికులకు వేతన బకాయిల చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,668 కోట్లు విడుదల చేసింది.మూడు,నాలుగు రోజుల్లో వేత...
ఉపాధి హామీ పథకం శ్రామికులకు వేతన బకాయిల చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,668 కోట్లు విడుదల చేసింది.మూడు,నాలుగు రోజుల్లో వేతన బకాయిలు శ్రామికుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.ఈ ఏడాది మే 15 తర్వాత నుంచి శ్రామికులకు వేతనాలు చెల్లించాల్సి ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు లేఖలు రాసింది.ప్రస్తుతం విడుదల చేసిన నిధులతో ఆగస్టు 15 వరకు పెండింగ్ బకాయిలు తీరిపోతాయని అధికారులు తెలిపారు.మిగిలిన చెల్లింపులకు మరో రూ.137 కోటు అవసరమని వివరించారు.
COMMENTS