జనవాసాలు, రద్దీ ప్రదేశాల్లో యదేచ్చగా గ్యాస్ రీఫిల్లింగ్ పట్టణంలో అక్రమంగా కొనసాగుతున్న రీ ఫిల్లింగ్ దందా చిలకలూరిపేట:చుట్టూ జ...
జనవాసాలు, రద్దీ ప్రదేశాల్లో యదేచ్చగా గ్యాస్ రీఫిల్లింగ్
పట్టణంలో అక్రమంగా కొనసాగుతున్న రీ ఫిల్లింగ్ దందా
చిలకలూరిపేట:చుట్టూ జనవాసాలు. చూట్టు పెద్ద పెద్ద దుకాణాలు. ఎప్పూడూ రద్దీగా ఉండే ప్రదేశాలు. ఇటువంటి ప్రదేశాల్లో డబ్బుల కోసం నిబంధనలను తుంగలో తొక్కి ప్రమాదకరమైన వ్యవహారాలకు తెరతీస్తున్నారు కొంతమంది ప్రబుద్దులు. చిన్న పాటి ప్రమాదం జరిగినా నష్టం తీవ్ర స్థాయి ఉంటుందని తెలిసినా పట్టించకోకుండా వ్యవహరించటం వారి నిర్లక్ష్యానికి పరాకాష్టాగా చెప్పవచ్చు. గ్యాస్ వినియోగంలో కూడా ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండడం కూడా ఎంతో ముఖ్యం. కానీ, కొందరు మాత్రం గ్యాస్ విషయంలో ఏ మాత్రం భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ దందా చేస్తూ కావల్సినోడికి కావాల్సినంత సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతి లేకుండా ఇలా అక్రమంగా రీఫిల్లింగ్ చేయడం చట్టరీత్యా నేరమన్న విషయాన్ని కూడా తేలిగ్గా తీసుకుంటున్నారు.
జనవాసాలు, రద్దీ ప్రదేశాల్లో యదేచ్చగా గ్యాస్ రీఫిల్లింగ్
చిలకలూరిపేట పట్టణంలోని గ్యాస్ ఫిల్లింగ్ అత్యంత ప్రమాదకరమైన వ్యవహారంగా మారింది. గత కొన్ని సంవత్సరాల కిందట తహశీల్దార్ వెనుక ఒకటి రెండు దుకాణాల్లో గ్యాస్ ఫిల్లింగ్ రహస్యం నిర్వహించేవారు. అధికారులను మేనేజ్ చేసుకొని తమ వ్యవహారాన్ని కొనసాగించేవారు. అయితే పట్టణం విస్తరించం, వివిధ అవసరాల రిత్యా ఈ ప్రాంతాలకు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఉపాధి కోసం వచ్చి స్థిర నివాసాలు ఏర్పచుకోవడంతో వారి అవసరాల రిత్యా అనధికారికంగాగ్యాస్ ఫిల్లింగ్ చేసే దుకాణాలు పెరిగి పోయాయి. గ్యాస్ స్టౌవులు,లైట్లు చిన్న సిలిండర్‌లకు మరమ్మతులు చేస్తున్నామని చెప్పి దర్జాగా దుకాణాల్లోనే గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తున్నారు. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగితే వెంటనే ఆర్పేందుకు కావాల్సిన స్ప్రేలు, సౌకర్యాలు అందుబాటులో కూడా ఉండవు. ఇటువంటి దుకాణాలన్ని రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఉండటం వల్ల ప్రమాదం జరిగినప్పుడు పక్కనున్న ఇతర వ్యాపారా సముదాయాలకు మంటలు వ్యాపించి భారీ ఆస్తి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. మరోవైపు ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే గ్యాస్ సిలెండర్లను కొనుగోలు చేసి కేజీకి ఇంత అని వసూలు గ్యాస్‌ను రీఫిల్లింగ్ చేయటం జరుగుతుంది. ఇందువల్ల ప్రభుత్వ లక్ష్యం కూడా దెబ్బతింటుంది. సంబంధిత అధికారులు ఇటువంటి గ్యాస్ రీ ఫిల్లింగ్ చేసే అక్రమాక్కులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

COMMENTS