*సమావేశాలు గైర్హాజరైన విడదల గోపీ* *సభ్వత్వం రద్దవడటంతో అదే వార్డులో ఎన్నిక* *రాష్ట్ర వ్యాప్తంగా 34 మున్సిపాలిటీల్లో 43వార్డ...
*సమావేశాలు గైర్హాజరైన విడదల గోపీ*
*సభ్వత్వం రద్దవడటంతో అదే వార్డులో ఎన్నిక*
*రాష్ట్ర వ్యాప్తంగా 34 మున్సిపాలిటీల్లో 43వార్డులకు ఉప ఎన్నికలకు సంసిద్దం*
చిలకలూరిపేట:
చిలకలూరిపేట మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న 31 వార్డుకు సంబంధించి ఎన్నిక నిర్వహించటానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. పట్టణంలోని 31వార్డుకు గతంలో మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీనాధ్ వైసీపీ తరుఫున గెలుపొందారు. అయితే మున్సిపల్ సమావేశాలకు హాజరుకాని కారణంగా ఇటీవల ఆయన సభ్వత్వాన్ని రద్దు చేస్తూ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది. మున్సిపల్ సవేశాలకు వరుసగా గోపీ ఆరు సమావేశాలకు హాజరుకాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టం 1965 ప్రకారం మున్సిపల్ కౌన్సిలర్ ముందస్తు అనుమతి లేకుండా వరుసగా మూడు సమావేశాలకు హాజరుకాకపోతే, వారి సభ్యత్వం రద్దు అయ్యే అవకాశం ఉంది.గత మున్సిపల్ ఎన్నికలు 2021 మార్చి 10వ తేదీ నిర్వహించి, 14వ తేదీ ఫలితాలు వెలువరించారు. మున్సిపల్ చట్టం ప్రకారం ఆ కౌన్సిల్ పదవీకాలం ముగియడానికి 6 నెలల కంటే తక్కువ సమయం మిగిలి ఉంటే, ఆ స్థానానికి ఉపఎన్నికలు నిర్వహించరు. కాని ప్రస్తుతం ఉన్న కౌన్సిల్ సమయం వచ్చే ఏడాది మార్చి వరకు సమయం ఉండటంతో దీంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయటానికి ఏర్పాట్లు మొదలయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 34 మున్సిపాలిటీల్లో 43వార్డులకు ఉప ఎన్నికలు
ఇందులో భాగంగానే ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలోని 34 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న 43 వార్డులకు ఉప ఎన్నికలు నిర్వహించటానికి సిద్దమౌతుంది. ఇందుకు సంబంధించిన ఫోటో ఓటర్ల జాబితాను ఆగస్టు 20, 2025న విడుదల చేయనున్నారు. ఈ వార్డుల్లో ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేయడానికి జరగబోయే ఉపఎన్నికల కోసం ఈ జాబితాలు సిద్ధం చేయబడుతున్నాయి. జనవరి ఒకటో తేదీ 2025 నాటి ఓటర్ల జాబితాను అనుసరించి ఆయా వార్డుల్లో ఫోటో ఓటర్ల జాబితాను తయారు చేస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పలువురు అధికారులకు శిక్షణ కూడా ఇచ్చారు. వచ్చే సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే మున్సిపాలిటి పరిదిలో 31వార్డు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.
-----------------------------------

COMMENTS