వైసీపీ కార్యకర్త పాలేటి కృష్ణవేణిని అసత్య ప్రచారం కేసులో పల్నాడు పోలీసులు సోమవారం విచారించి తిరిగి సబ్ జైలుకు తరలించారు. వక్ఫ్ బిల్లుకు...
వైసీపీ కార్యకర్త పాలేటి కృష్ణవేణిని అసత్య ప్రచారం కేసులో పల్నాడు పోలీసులు సోమవారం విచారించి తిరిగి సబ్ జైలుకు తరలించారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా అసత్య ప్రచారం చేసిన ఆరోపణలపై విచారణ జరిగింది.
అసత్య ప్రచారం కేసులో ఒకరోజు విచారణ....
సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ పోస్టులు పెట్టిన కేసులో వైసీపీ కార్యకర్త పాలేటి కృష్ణవేణిని పల్నాడు పోలీసులు సోమవారం విచారించారు. రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమెను కస్టడీలోకి తీసుకుని ఉదయం నుంచి సాయం త్రం వరకు విచారించి తిరిగి సబ్ జైలులో అప్పగించారు. ఈనెల 11న వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నరసరావుపేటలో నిర్వహించిన ప్రదర్శనలో సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ చిత్రపటాలపై చెప్పులతో కొట్టినట్లు కృష్ణవేణి సోషల్‌మీడియాలో అసత్య ప్రచారం చేశారు. దీనిపై నమోదైన కేసులో మే 5 వరకు కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. విచారణ నిమిత్తం కృష్ణవేణిని తమ కస్టడీకి ఇవ్వాలని గత బుధవారం నరసరావుపేట మొదటి పట్టణ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు సోమవారం ఒకరోజు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు పోలీసులు కృష్ణవేణిని పోలీసులు విచారించారు.
COMMENTS