ఎడ్లపాడు గ్రామంలో ఆదివారం షుగర్ బిపి వ్యాధులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బాసట సామాజిక సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ శిబిర...
ఎడ్లపాడు గ్రామంలో ఆదివారం షుగర్ బిపి వ్యాధులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బాసట సామాజిక సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ శిబిరంలో ప్రముఖ వైద్య నిపుణులు లింగమల్లు మోహన్ భాస్కర్ , డాక్టర్ గుంటుపల్లి భవ్యతేజపాల్గొని రోగులకు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారు. గ్రామంలోని పోపూరి రామారావు విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ శిబిరంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 230 మంది హాజరయ్యారు. ముందుగా వ్యాధిగ్రస్తులకు ఆహార నియమాలు మందుల వియోగంపై వైద్యులు అవగాహన కల్పించారు. అనంతరం రెండు నెలలకు సరిపడా మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బాసట ప్రతినిధులు నూతలపాటి కాళిదాసు, స్వామినేని శ్రీనివాస్, కేత రామబ్రహ్మం, ముత్తవరపు రవీంద్ర, వేణుగోపాల్, గోనుగుంట్ల కిరణ్, రావి సురేష్ బాబు, చిట్టిపోతు రంగారావు, రావూరి సురేష్, కోయ రామోజీరావు పాల్గొన్నారు.
COMMENTS