ఏపీయూడబ్ల్యూజే అనుబంధప్రెస్‌క్లబ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు లస్సీ, మజ్జిగ పంపిణీ రానున్న రోజుల్లో సేవా కార్య...
ఏపీయూడబ్ల్యూజే అనుబంధప్రెస్‌క్లబ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో
పారిశుధ్య కార్మికులకు లస్సీ, మజ్జిగ పంపిణీ
రానున్న రోజుల్లో సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామన్న జర్నలిస్టు సంఘ నాయకులు
చిలకలూరిపేట:పేద ప్రజలకు సేవలు చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని, వృత్తిపరంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ జర్నలిస్టులు సేవా కార్యక్రమాలుచేపట్టడంఅభినందనీయమని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు చెప్పారు. ఏపీయూడబ్ల్యూజే అనుబంధ ప్రెస్‌క్లబ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు మజ్జిగ, లస్సీ ని ఒకటో డివిజన్‌లో కమిషనర్ చేతుల అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కమిషనర్ మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజల సమస్యల్ని వెలికి తీసే బాధ్యత నిర్వహించడమే కాకుండా, సమాజ సంక్షేమం కోసం కూడా ముందడుగు వేస్తుండటం అభినందనీయ మన్నారు. పారిశుధ్య కార్మికులు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని, వేసవిలో వారి సేవలు గుర్తించి జర్నలిస్టు సంఘం స్పందించిందని వెల్లడించారు. భవిష్యత్తులోనూ జర్నలిస్టులు సేవా కార్యక్రమాల్లో ముందంజలో నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అడపా అశోక్, కార్యదర్శి షేక్ దరియావలి మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు, ఎలక్ట్రానికి మీడియా రాష్ట్ర అధ్యక్షుడు యేచూరి శివ ఇచ్చిన పిలుపు మేరకు వేసవి లో లస్సీ, మజ్జిగ పంపిణీకార్యక్రమాలుకొనసాగిస్తున్నామని తెలిపారు. గతంలోనూ ఇదే తరహ కార్యక్రమాలను నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. సమాజానికి మంచి జరగాలనే ఉద్దేశంతోనే జర్నలిస్టులుఎల్లప్పుడుపనిచేస్తుంటారని, ఇందులో భాగంగానే తాము ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమతో కలిసి నడుస్తున్న క్లబ్ సభ్యులకు ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో తమ సేవా కార్యక్రమాలను విస్తృతం చేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో
శానిటరీ ఇనస్పెక్టర్ రమణ రావు,తోట మల్లికార్జునరావు,ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు కొచ్చర్ల చందు, జాయింట్ సెక్రెటరీ సుందర్ బాబు, ,కొండెపాటి రమేష్, పెనుమల మనోహర్, కొనికి సాంబశివరావు, అమ్మనబ్రోలు శివనారాయణ, రావిపాటి రాజా, నరసింహుల శ్రీకాంత్ శానిటేషన్ మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు.
COMMENTS