*అక్షర యోధుడు రామోజీరావు మరణంతో...* *కోట్లాది హృదయాలు తల్లడిల్లుతున్నాయి* *పీడిత తాడిత ప్రజలకు అక్షరమనే ఆయుధానిచ్చి కొండంత అండగా నిలిచిన గొ...
*అక్షర యోధుడు రామోజీరావు మరణంతో...*
*కోట్లాది హృదయాలు తల్లడిల్లుతున్నాయి*
*పీడిత తాడిత ప్రజలకు అక్షరమనే ఆయుధానిచ్చి కొండంత అండగా నిలిచిన గొప్ప అక్షర పోరాట యోధుడు రామోజీరావు*
*తెలుగుబాషను కాపాడుకునేందుకు తన చివరి శ్వాస వరకు పోరాడిన తెలుగుతల్లి ముద్దుబిడ్డ రామోజీరావు
*రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించిన జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి*
ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ , వ్యాపార దిగ్గజం , కళాపిపాసి , పద్మవిభూషణుడు డాక్టర్ చెరుకూరి రామోజీరావు మరణ వార్త తెలిసినప్పటి నుంచి సొంత కుటుంబ సభ్యున్ని కోల్పోయినట్లుగా కోట్లాది హృదయాలు తల్లడిల్లుతున్నాయని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. శనివారం శ్రీనివాసరావుతోటలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి బాధాతప్త హృదయంతో శ్రద్దాంజలి ఘటించారు. రామోజీరావు మరణంతో పాత్రికేయరంగం ఒక దిగ్గజాన్ని కోల్పోయిందని ఆవేదన చెందారు. సమాజంలోని పీడిత తాడిత ప్రజలకు , అన్యాయాలకు గురైన వారికి అక్షరం అనే ఆయుధానిచ్చి వారికి అండగా నిలిచిన అక్షర పోరాట యోధుడు రామోజీరావు అన్నారు. పాలకుల అవినీతిని ప్రశ్నించటంలోనూ , అక్రమాలను ఎదిరించటంలోనూ నిష్పక్షపాతంగా వ్యవహరించిన జర్నలిజ దార్శనికుడు రామోజీరావు అన్నారు. నిరాదరణకు గురై కొనవూపిరితో కొట్టుమిట్టాడుతున్న తెలుగు భాషను కాపాడుకునేందుకు తన చివరి శ్వాస వరకు పోరాడిన తెలుగుతల్లి ముద్దుబిడ్డ రామోజీరావు అన్నారు. పత్రికలోనూ , బుల్లితెరలోనూ ఎక్కడా అక్షర దోషం రాకుండా తెలుగు భాషను గుండెల్లో పెట్టుకొని చేసుకొన్న బాషాభిమాని రామోజీరావు అన్నారు. రామోజీరావు మరణంతో అక్షరం అనాథ అయ్యిందంటూ వ్యాఖ్యానించారు. తాను ప్రవేశించిన ప్రతీ రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారంటూ కొనియాడారు. జర్నలిజంలోనూ , సినీ రంగంలోనూ , వ్యాపార రంగంలోనూ రామోజీరావు చేసిన సేవలు , తీసుకొచ్చిన మార్పులు భావితరాలకు స్ఫూర్తి దాయకమన్నారు. తెలుగుజాతి కీర్తిని , ఖ్యాతిని ఖండతారాలకు వ్యాపించేసిన కారణజన్ముడు రామోజీరావు అని ఆళ్ళ హరి అన్నారు.రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వారిలో జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు సయ్యద్ షర్ఫుద్దీన్ , గడ్డం రోశయ్య , నాజర్ వలి , మహేష్ , టీడీపీ నాయకులు సయ్యద్ చాంద్ , చింతకాయల వెంకట సాయి , గురుప్రసాద్ , తిరుమలరావు , తేజ తదితరులు పాల్గొన్నారు.
COMMENTS