సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు జన చైతన్య ప్రాపర్టీస్ మరియు శ్రేష్ఠ గ్రూప్ అధినేత మాదాల చైతన్య ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగాయి....
సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు జన చైతన్య ప్రాపర్టీస్ మరియు శ్రేష్ఠ గ్రూప్ అధినేత మాదాల చైతన్య ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగాయి.నగరంలో ర్యాలీ నిర్వహించి,కేకును కట్ చేసిన అనం తరం అభిమానులకు మిఠాయిలు పంచి పెట్టారు.నట సింహంగా అనేక బిరుదులు పొంది, ఎమ్మెల్యేగా విశేష సేవలందిస్తూ నందమూరి వంశానికే బాలయ్య ఆదర్శంగా నిలిచారన్నారు.పేదలకు ఉచిత కాన్సర్ వైద్యం అందిస్తున్న మహోన్నత సేవాతత్పరుడు నందమూరి బాలకృష్ణ అని అన్నారు.హిందూపురం నుంచీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపారు.తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి నటవారసత్వ ప్రస్థానం చెరగనిదని అన్నారు.
COMMENTS