ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులను జయప్రదం చేయండి. ఈ నెల 15,16,17 తేదీలలో(STEP )స్టెప్ రాష్ట్ర కమిటీ ఆద్వర్యంలో తుళ్ళూరు మండలం నెక్కల్లు...
ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులను జయప్రదం చేయండి.
ఈ నెల 15,16,17 తేదీలలో(STEP )స్టెప్ రాష్ట్ర కమిటీ ఆద్వర్యంలో తుళ్ళూరు మండలం నెక్కల్లు గ్రామంలో ఉచితంగా పరిపూర్ణ వ్యక్తిత్వ వికాస శిక్షణ నిర్వహిస్తున్నామని STEP ప్రిన్సిపల్ డాక్టర్. బత్తుల క్రిష్ణయ్య, రాష్ట్ర కోఆర్డినేటర్ K.పావని ఒక ప్రకటనలో తెలియ చేశారు. స్థానిక కొరిటెపాడు లోని (STEP) స్టెప్ కార్యలయంలో ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరిస్తూ నేటి విద్యార్థులలో, ఉపాధ్యాయులలో, తల్లితండ్రులలో ఉన్న శక్తి, సామర్థ్యాలను వెలికి తీయడానికి, వారిలో ఉన్న ఆత్మన్యూనత భావాన్నీ పోగొట్టి, ఆత్మవిస్వాసాన్ని నింపి వారు ఉన్న రంగంలో శక్తి వంతులుగా తీర్చిదిద్ది మంచి సమాజం ఏర్పాటు కోసం ఏర్పాటు కోసం జరుగుతున్న ఈ ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులను వినియోగించు కోవాలని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారికి ఉచిత భోజన, వసతి ఏర్పాటు చేసి నిష్ణాతులైన సైకాలజిస్టులు, వ్యక్తిత్వ వికాస నిపుణులతో శిక్షణ ఇవ్వబడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మారెడ్డి, శరత్, మల్లికార్జున్, సతీష్ బాబు, రామేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ శిక్షణకు హాజరు కావాలనుకునేవారు ఫోన్ - 9666813833 - 7386883244. సంప్రదించ వలసిందిగా కోరారు.
COMMENTS