Health Tests మహిళల ఆరోగ్యం కోసం అవసరమైనవి ఆరు పరీక్షలు. వాళ్లకు వచ్చే ఆరోగ్య సమస్యల్లో మరీ ప్రత్యేకమైనవి మినహాయిస్తే సాధారణంగా ఆ పరీక్షలు ఆర...
![]() |
| Health Tests |
మహిళల ఆరోగ్యం కోసం అవసరమైనవి ఆరు పరీక్షలు. వాళ్లకు వచ్చే ఆరోగ్య సమస్యల్లో మరీ ప్రత్యేకమైనవి మినహాయిస్తే సాధారణంగా ఆ పరీక్షలు ఆరింటితోనే చాలావరకు సమస్యలు తెలుసుకోవచ్చు. మహిళల్లో ఆస్టియోపోరోసిస్ ఎక్కువ కాబట్టి బోన్ డెన్సిటోమీటర్ ద్వారా పరీక్ష అవసరం. రక్తహీనత కూడ ఎక్కువ కాబట్టి... కంప్లీట్ బ్లడ్ పిక్చర్ పరీక్ష. సర్విక్స్ క్యాన్సర్ కోసం పాప్స్మియర్, బ్రెస్ట్ క్యాన్సర్ కోసం మామో గ్రామ్ పరీక్షలు కావాల్సిందే. ఓ వయస్సు దాటక వచ్చే కాంప్లికేషన్ అయిన డయాబెటిస్, కొలెస్ట్రాల్ సమస్యల కోసం కొలెస్ట్రాల్ స్థాయిల పరీక్ష. వెరసి... ప్రాథమిక స్థాయిలో ఆ ఆరు పరీక్షలు అవసరాలను బట్టి చేయిస్తూ, ఆ మేరకు చికిత్స తీసుకుంటుంటే మహిళల ఆరోగ్యం చాలామట్టుకు పదిలంగా వుంటుంది.
కంప్లీట్ బ్లడ్ పిక్చర్
రక్తంలో ప్రధానంగా ఎరర్రక్తకణాలతో పాటు ఇతరత్రా మారెన్నో అంశాలు... అంటే తెల్లరక్తకణాలు, ప్లేట్ లెట్లు వంటివి తెలిపే పరీక్షే ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ). సాధారణంగా భారతీయు మహిళల్లో రక్తహీనత సర్వసాధారణం. పైగా వాళ్లు రజస్వల అయిన నాటి నుంచి రుతుస్రావం రూపంలో ప్రతి నెలా రక్తాన్ని కోల్పోవడం సర్వసాధారణం. ప్రతి ఏడాదీ అర లీటరు వరకు రక్తం వరకు కోల్పోతారు. అది దాదాపు రెండు సార్లు రక్తదానంతో సమానం. అంటే రక్తదానం చేయకపోయినా సరే... వాళ్లలా కోల్పోతూనే ఉంటారు. అందుకే దాదాపు భారతీయు వుహిళలందరిలోనూ అంతో ఇంతో రక్త హీనత సర్వసాధారణం.
ఒక డెసీలీటర్కు హిమోగ్లోబిన్ ఎంత అన్నదాన్ని బట్టి రక్తహీనతను నిర్ణయిస్తారు.
11ఎం.జీ/డీఎల్ (మిల్లీగ్రామ్స్ పర్ డెసీ లీటర్) నుంచి 16ఎంజీ/డీఎల్ అన్నది నార్మల్.
దీంతోపాటు రక్తంలోని మిగతా అంశాలైన న్యూట్రీలైట్స్ వంటివి కూడా లెక్కించి అవి నార్మల్గా ఉన్నాయా, లేవా? అన్నది తెలుసుకుంటారు. అంతేకాదు ప్లేట్ లైట్ ల సంఖ్య తగినంత ఉందో లేదో చూస్తారు. రక్తంలోని దాదాపు అన్ని అంశాలను తెలుసుకునేందుకు ఉపకరించే పరీక్షే ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్.
కొలెస్ట్రాల్
రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదు అవసరమైన దానికంటే ఎక్కువైతే రక్తనాళాలు కొవ్వుతో నిండి హృద్రోగాలు, పక్షవాతం వంటి సమస్యలు వస్తాయి. మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను రక్త పరీక్ష ద్వారా తేలిగ్గా కనుక్కోవచ్చు. ఈ పరీక్షలో మన ఎల్ డి ఎల్ (లోడెన్సిటీ లైపోప్రొటీన్ లెవల్), హెచ్ డీ ఎల్ (హై డెన్సిటీ లైపో ప్రొటీన్ లెవెల్) తెలుస్తాయి. ఎల్ డి యల్ ఎక్కువగా ఉంటే ధమనుల్లో కొవ్వు చేరి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎల్ డి యల్ ను ‘‘చెడు కొలెస్ట్రాల్’’ అని అంటారు. అదే హెచ్ డీ ఎల్ అయితే రక్తనాళాల్లో కొవ్వు చేరకుండా చేస్తుంది. అందుకే దీన్ని ‘‘మంచి కొలెస్ట్రాల్’’ అని అంటారు. మన శరీరంలో ఎప్పుడు హెచ్ డీ ఎల్ ఎక్కువగా ఉండి ఎల్ డి యల్ తక్కువగా ఉండటం మంచిది.అందుకే గతంలో ఎలాంటి లక్షణాలు లేనివారు 45 ఏళ్లుపై బడ్డవాళ్లు ప్రతి ఐదేళ్లకు ఒకసారి పరీక్ష చేయించుకోవాలి. అదే రిస్క్ ఫాక్టర్స ఉన్నవారైతే డాక్టర్ సలహా మేరకు ప్రతి ఏడాదీ, పరీక్షలు చేరయిచు కోవాలి. వుహిళల్లో డయూబెటిస్, బీపీ వంటివి కనిపింనప్పుడు తక్షణం కొలెస్ట్రాల్ పరీక్షలు కూడా చేయించాలి. కుటుంబంలో కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవాళ్లయితే ఆ పిల్లలు రజస్వల అయిననాటి నుంచే ప్రారంభించి, ప్రతి రెండు మూడేళ్ల కు ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి.
డయాబెటీస్
డయాబెటీస్ అంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండటం. క్లోమగ్రంథి అవసరమైన దానికంటే తక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడంవల్ల లేదా కండరాలు, కాలేయం, కొవ్వులో ఉండే జీవకణాలు ఇన్సులిన్ నిసరిగ్గా వాడకపోవడంవల్ల చక్కెర వ్యాధి వస్తుంది. డయాబెటీస్ లో మూడు రకాలున్నాయి.
టైప్ 1, టైప్ 2, జస్టేషనన్ డయాబెటీస్.
టైప్ 1 డయాబెటీస్ : ముఖ్యంగా పిల్లల్లో, టీనేజర్స్లో, యవ్వనస్తుల్లో కనిపిస్తుంది.
టైప్ 2 డయాబెటీస్ : ఏ వయస్సు వారికైనా వస్తుంది.
జెస్టేషనన్ డయాబెటీస్ : కొంతమంది మహిళల్లో గర్భవతిగా ఉన్న సమయలో వచ్చే మధుమేహాన్ని జెస్టేషనన్ డయాబెటిస్ అంటారు. అందుకే గర్భవతులు దీనికోసం ప్రెగ్నెన్సీ 20-22వ వారాల వుధ్య సమయంలో తప్పనిసరిగాఈ పరీక్ష చేయించుకోవాలని డాక్టర్ల సూచన. ఇలా గర్భవతి గా ఉన్న సమయంలో డయాబెటిస్ కనిపిస్తే చాలావరకు ఆ తర్వాత కూడా మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఇలాంటి వాళ్లు తప్పనిసరిగా ఆ తర్వాత కూడా డాక్టర్ సూచనల మేరకు తరచూ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఏ లక్షణాలూ కనిపించకపోయినా సాధారణంగా 45 ఏళ్లు దాటాక తరచూ డయాబెటిస్ కోసం పరీక్షలు చేయించడం మంచిది.
బోన్ డెన్సిటీ టెస్ట్
యాభై వయస్సు పై బడ్డ స్ర్తీలలో ఆస్టియో పొరోసిస్ నికనుక్కోవడానికి చేసే టెస్ట్ ఈ బోన్ డెన్సిటీ టెస్ట్. మన దేశంలోని వుహిళలలో మెనోపాజ్ దాటాక దాదాపు అందరికీ వచ్చే వ్యాధే ఆస్టియో పోరోసిస్. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు పెళుసుగా మారి పలచబడటం. ఎముకల్ని బలంగా, మందంగా ఉంచే క్యాల్షియంతో పాటు మరికొన్ని ఖనిజాలు కోల్పోవడం వల్ల ఎముకలు పలచబడటం జరుగుతుంది. మెనోపాజ్ వల్ల ఈస్ట్రోజన్ హర్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడంతో ఈ స్థితి వస్తుంది. మరీ సన్నగా ఉండే స్ర్తీలు, కుటుంబ చరిత్రలో ఈ వ్యాధి ఉన్నవాళ్లు ఈ జబ్బుకి గురయ్యే అవకాశాలు ఎక్కువ. 60 ఏళ్లు దాటిన వుహిళల్లో 50% మందిలో, 80 ఏళ్లు దాటిన వారిలో 90% వుంది వుహిళల్లో ఈ వ్యాధి కనిపిస్తుంది. బోన్ డెన్సిటీ పరీక్ష ద్వారా ఆస్టియో పోరోసిన్ ను కనుక్కోవడం చాలా సులభం. ఆస్టియోపోరోసిస్ ఉన్నవారికి ఎముకల్లో నొప్పి ఎక్కువగా ఉంటే మణికట్టు, వెన్నెముక, తుంటిఎముక భాగాలను ఈ బోన్ డెన్సిటో మీటర్ ద్వారా పరీక్షిస్తారు.
ఆస్టియోపోరోసిస్ను నివారించడానికి రెగ్యులర్ ఎక్సర్సైజు లు చేయుడం, ఆహారంలో క్యాల్షియుం ఎక్కువగా ఉండే పాలు, పాల ఉత్పాదనలు అధికంగా వాడటం వంటివి చేయూలి.
పాప్ స్మియర్
సర్వికల్ క్యాన్సర్ ని కనుక్కోవడానికి చేసే పరీక్షని పాప్ స్మియర్ టెస్ట్ అంటారు. సర్విక్స్ అనేది గర్భసంచిలో ఒకభాగం. ఉన్న క్యాన్సర్ అంనింటిలోనూ సెర్విక్స్ కు వచ్చే క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ. దానికి తోడు క్యాన్సర్ను రాకమూనుపే అంటే ప్రీ-క్యాన్సర్ దశలోనే గుర్తించడం సెర్విక్స్ క్యాన్సర్ విషయుంలోనే సాధ్యప డుతుంది. (ప్రీ క్యాన్సర్ కండిషన్ క్యాన్సర్గా మారడానికి 10 ఏళ్లు కూడా పట్టవచ్చు). పాప్స్మియుర్తో చాలా ముందుగా దీన్ని కనుగొనే అవకాశం ఉండటంతో లక్షణాలు కనిపించినా, కనపించకున్నా రొటీన్ గా ఈ పరీక్ష మహిళలందరికీ చేయింస్తుంటారు. ఈ పరీక్షను 25-30 ఏళ్ల వయుస్సు నుంచి మహిళల్లో కనీసం ఏడాదికి ఓవూరు చేయించుకోవడం అవసరం. పాప్ స్మియుర్ అన్నది ఏవూత్రం నొప్పిలేని చాలా సాధారణ పరీక్ష. సాధారణంగా పరీక్షల్లో స్క్రీనింగ్ అని, డయూగ్నస్టిక్ అని చాలా రకాలు ఉంటాయి. పాప్స్మియుర్ను స్క్రీనింగ్ పరీక్షగా పరిగణించవచ్చు. విదేశాల్లో అయితే దీన్ని రీప్రొడక్టివ్ వయుస్సులో సెక్సువల్ యూక్టివిటీ కొనసా గుతున్నంతకాలం చేయింస్తుంటారు. అయితే వున దేశంలో అలాంటి ప్రమణాలు ఏవీ లేవు. అయినప్పటికీ 25-30 ఏళ్ల వయుస్సు నుంచి వుహిళల్లో తరచూ చేయుడం అవసరం.
మామోగ్రామ్
స్ర్తీలలో బ్రెస్ట క్యాన్సర్ని కనుక్కోవడానికి చేసే పరీక్ష ఇది. మామోగ్రామ్ ను అంటే బ్రెస్ట్ ను ఎక్స్ రే తీయడం లాంటిదే. మొదటి దశలోనే క్యాన్సర్ని కనుక్కుంటే మాసెక్టమీ (రొమ్మును పూర్తిగా తొలగించడం) అవసరం లేకుండా ట్రీట్మమెంట్ చేయించుకోవచ్చు. ఐదు నుంచి పదినిమిషాల పాటు జరిగే ఈ పరీక్ష ఎటువంటి నొప్పి లేకుండా చాలా సులువుగా చేయించుకోవచ్చు. నలభై సంవత్సరాలనుండి ఏడాదికొకసారి ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు ఈ టెస్ట్ ను ముప్ఫై సంవత్సరాల వయస్సు నుంచి చేయించు
కోవడం మొదలుపెట్టాలి. ఇక మామోగ్రాము అన్నది స్క్రీనింగ్ పరీక్ష కాదు. వుహిళలు తన రొమ్ముల్లో నిర్దిష్టంగా ఏదైనా సమస్య గడ్డలాంటిది తగులుతుందన్నప్పుడో, నొప్పిగా, సలపరంగా ఉన్నాయని చెప్పినప్పుడు, కుటుంబ చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ)లో ప్రధానంగా తల్లితరుఫు బంధువుల్లో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లయితే మామోగ్రామ్ ను చేయించడం ఉత్తమం. కొన్ని సందర్భాల్లో సర్విక్స్ క్యాన్సర్, పేగులకు క్యాన్సర్ కనుగొన్నట్లయితే వారిలో లక్షణాలు కనిపించినా, కనిపించకపోయినా మామో గ్రామ్ చేస్తారు. కారణం... సర్విక్స్, పేగు క్యాన్సర్లతో పాటు బ్రెస్ట్ క్యాన్సర్ కూడా కలిసి సమిష్టిగా ఓ సిండ్రోమ్ లా ఫాలో అయ్యే అవకాశం ఉంది. కాబట్టే ఆ పరీక్ష. ఇప్పుడు మామోగ్రామ్ పరీక్షల కోసం చాలా అడ్వాన్స్ డ్ సాంకేతిక పరిజ్ఞానం, ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయి.

COMMENTS