చెమట లేదా స్వేదం చర్మం నుండి ఉత్పత్తి చేయబడే ఒకరకమైన స్రావం. ఇది చర్మంలోని స్వేద గ్రంధుల నుండి తయారౌతుంది. దీనిలో ముఖ్యంగా నీరు , వివిధ లవణ...
చెమట లేదా స్వేదం చర్మం నుండి ఉత్పత్తి చేయబడే ఒకరకమైన స్రావం. ఇది చర్మంలోని స్వేద గ్రంధుల నుండి తయారౌతుంది. దీనిలో ముఖ్యంగా నీరు, వివిధ లవణాలు (ముఖ్యంగా క్లోరైడ్స్) కలిసి ఉంటాయి. స్వేదంలో కొన్ని దుర్వాసన కలిగించే పరార్ధాలు మరియు కొద్దిగా యూరియా కూడా ఉంటుంది.
చెమట పట్టడం మానవులలో ఒక విధంగా ఉష్ణోగ్రతను నియంత్రించే విధానం. చర్మం మీది చెమట ఆవిరిగా మారినప్పుడు శరీరం చల్లబడుతుంది. ఉష్ణ ప్రదేశాలలో మరియు వ్యాయామం చేసేటప్పుడు చెమట ఎక్కువగా పడుతుంది. మానసిక ఒత్తిడి వలన కుడా చెమట ఎక్కువౌతుంది. చెమట శరిరంలోని కొన్ని భాగలలో ఎక్కువగా ఏర్పడుతుంది. తల, చంకలు మరియు ముఖంలో స్వేద గ్రంధులు ఎక్కువగా ఉండడం వలన ఈ ప్రదేశాలలో చెమట పడుతుంది. అయితే చల్లని వాతావరణంలో చెమట చాల తక్కువగా పడుతుంది.

COMMENTS