•అగ్నిప్రమాద వారోత్సవాలు ప్రారంభించి, అగ్నిమాపక సిబ్బంది సేవలను కొనియాడిన మాజీమంత్రి. చిలకలూరిపేట: నేషనల్ ఫైర్ సర్వీస్ డే సందర్భ...
•అగ్నిప్రమాద వారోత్సవాలు ప్రారంభించి, అగ్నిమాపక సిబ్బంది సేవలను కొనియాడిన మాజీమంత్రి.
చిలకలూరిపేట: నేషనల్ ఫైర్ సర్వీస్ డే సందర్భంగా నేడు (ఏప్రిల్ 14) ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు 20వ తేదీ వరకు జరుగుతాయని, ఊహించని విపత్తులు, అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ, ఆస్తినష్టం లేకుండా ఉత్తమ సేవలందిస్తున్న అగ్నిమాపక సిబ్బందే మనకు నిజమైన హీరోలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
పట్టణంలోని ఫైర్ స్టేషన్ రోడ్ లోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ వేసవిలో అధికంగా అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశమున్నందున ప్రజలు అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వ్యాపారవర్గాలు అగ్నిమాపక శాఖ నియమ, నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, అపార్ట్ మెంట్లు నిర్మించుకునే వారు, నిర్మాణ సంస్థలు, గుత్తేదారులు కూడా ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలని, అప్పుడే భవిష్యత్ లో ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలకు సకాలంలో సరైన రక్షణ లభిస్తుందన్నారు. ప్రజలు వారోత్సవాల ముఖ్య లక్యాన్ని గ్రహించి, అగ్నిప్రమాద నివారణ చర్యలపై అవగాహన పెంచుకోవాలని ప్రత్తిపాటి సూచించారు.
కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా,పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, కామినేని సాయిబాబు, మాజీమున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు అమరా రమాదేవి, ముల్లా కరీముల్లా, మురకొండ మల్లిబాబు , షేక్ మస్తాన్ వలి, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
COMMENTS