ఏడుగురు అరెస్ట్.. ఎడ్లపాడు: మండల పరిధిలోని గ్రామ శివారులో జూదం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో ఎస్సై శివరామకృష్ణ ఆధ్వర్యంలో ప...
ఏడుగురు అరెస్ట్..
ఎడ్లపాడు: మండల పరిధిలోని గ్రామ శివారులో జూదం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో ఎస్సై శివరామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు.ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి రూ.1,600 నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్సై శివరామకృష్ణ మాట్లాడుతూ,మండలంలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా జూదం,పేకాట వంటి వ్యసనాల వల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన ప్రజలను కోరారు.
COMMENTS