ఎడ్లపాడు: మండలంలోని ఉప్పరపాలెం గ్రామ పరిధిలోని వ్యవసాయ పొలాల్లో జరుగుతున్న జూద కార్యకలాపాలపై విశ్వసనీయ సమాచారం అందిన మేరకు ఎస్స...
ఎడ్లపాడు: మండలంలోని ఉప్పరపాలెం గ్రామ పరిధిలోని వ్యవసాయ పొలాల్లో జరుగుతున్న జూద కార్యకలాపాలపై విశ్వసనీయ సమాచారం అందిన మేరకు ఎస్సై టీ శివ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు దాడి నిర్వహించారు.ఈ
దాడి సందర్భంగా జూదంలో పాల్గొంటున్న 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి మొత్తం రూ.3,800/- నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ సందర్భంగా సబ్ ఇన్‌స్పెక్టర్ శివరామకృష్ణ మాట్లాడుతూ జూదం వంటి అక్రమ కార్యకలాపాలలో పాల్గొనకుండా ఉండాలని సూచించారు. గ్రామాలలో శాంతి భద్రతలను భంగం కలిగించే చర్యలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.
COMMENTS