చిలకలూరిపేట: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జనగణన 2027' మొదటి దశలో భాగంగా పౌరులందరికీ "స్వీయ గణన " ...
చిలకలూరిపేట: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జనగణన 2027' మొదటి దశలో భాగంగా పౌరులందరికీ "స్వీయ గణన " సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు తెలిపారు. బుధవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.
ప్రజలు తమ కుటుంబ వివరాలను ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ https://se.census.gov.in ద్వారా స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. వివరాల నమోదు పూర్తి కాగానే కుటుంబ యజమాని మొబైల్ నంబర్‌కు "Self Enumeration ID (SE ID)" ఎస్ఎంఎస్ ద్వారా వస్తుందని, భవిష్యత్తులో జనగణన సిబ్బంది గృహ సందర్శనకు వచ్చినప్పుడు ఈ ఐడీని వారికి చూపించాల్సి ఉంటుందని వివరించారు. ఒకవేళ నమోదు చేసిన వివరాల్లో మార్పులు ఉంటే ఎన్యుమరేటర్ ద్వారా సవరించుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.
COMMENTS