ప్రభుత్వాసుపత్రికి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు.. ప్రజారోగ్య పరిరక్షణలో కూటమిప్రభుత్వ పనితీరుకు నిదర్శనం : ప్రత్తిపాటి ప్రభుత్వాసుపత్రికి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు.. ప్రజారోగ్య పరిరక్షణలో కూటమిప్రభుత్వ పనితీరుకు నిదర్శనం : ప్రత్తిపాటి | AP News Line

ప్రభుత్వాసుపత్రికి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు.. ప్రజారోగ్య పరిరక్షణలో కూటమిప్రభుత్వ పనితీరుకు నిదర్శనం : ప్రత్తిపాటి

ఎమ్మెల్యే ప్రత్తిపాటి చొరవ, సహకారం వల్లే ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం : ప్రభుత్వాసుపత్రి వైద్యులు. చిలకలూరిపేట:  ప్రభుత్...


ఎమ్మెల్యే ప్రత్తిపాటి చొరవ, సహకారం వల్లే ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం : ప్రభుత్వాసుపత్రి వైద్యులు.


చిలకలూరిపేట:  ప్రభుత్వాసుపత్రి ఉత్తమ వైద్యసేవలతో కేంద్ర ప్రభుత్వ అవార్డు సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నానని, కూటమి ప్రభుత్వం ప్రజారోగ్య రక్షణకు ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ తరహా పురస్కారాలు నిదర్శనమని, భవిష్యత్ లోనూ ఆసుపత్రి వైద్య, వైద్యేతర సిబ్బంది మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించి, ప్రజల మన్ననలు పొందాలని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు.

శనివారం సాయంత్రం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో జరిగిన ఆసుపత్రి అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.  సమావేశంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడిన ఎమ్మెల్యే, వారి యోగక్షేమాలు విచారించి, అక్కడ అందుతున్న వైద్యసేవలు, వైద్య సిబ్బంది పనితీరు గురించి అరాతీశారు. 

వైద్య సిబ్బంది ఉత్తమ పనితీరు వల్లే కేంద్రప్రభుత్వ పురస్కారం.

ఉత్తమ పనితీరుతో పాటు.. రోగులకు అందించే వైద్యసేవల్లో మెరుగైన ప్రమాణాలు పాటిస్తున్నందుకు గాను. చిలకలూరిపేట ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు కేంద్ర ప్రభుత్వ పురస్కారం నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ గుర్తింపు లభించడంపై ఆసుపత్రి వైద్య, వైద్యేతర సిబ్బందిని అభినందిస్తున్నట్టు ప్రత్తిపాటి చెప్పారు. ఈ గుర్తింపు ద్వారా ప్రభుత్వాసుపత్రి నిర్వహణకు గాను కేంద్రప్రభుత్వం మూడేళ్లపాటు, ఏటా రూ.10 లక్షల చొప్పున 30 లక్షల నిధులు వస్తాయని ప్రత్తిపాటి చెప్పారు. రాష్ట్రంలో కేవలం 5 ప్రభుత్వాసుపత్రులకు మాత్రమే ఈ విధమైన పురస్కారం లభించిందన్నారు. 

ట్రామాకేర్, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుచేస్తే అన్నివసతులు సమకూరినట్టే..

ప్రతి రోజూ ఆసుపత్రికి 350 నుంచి 500 మంది ఔట్ పేషెంట్ రోగులు వస్తున్నారని, ఆసుపత్రి నిర్వహణకు అవసరమైన అన్ని సౌకర్యాలను కూటమిప్రభుత్వం వచ్చాకే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ట్రామాకేర్, బ్లడ్ బ్యాంక్ కేంద్రాలు ఏర్పాటుచేస్తే అన్ని వసతులు సమకూర్చినట్టు అవుతుందన్నారు. రూ.9 కోట్ల నిధులతో ఆసుపత్రిని అభివృద్ధి చేసినట్టు ప్రత్తిపాటి చెప్పారు.ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు నేతృత్వంలోని వైద్య, వైద్యేతర సిబ్బంది ఆసుపత్రి అభివృద్ధికి మరింత కృషి చేయాలని ప్రత్తిపాటి ఈ సందర్భంగా సూచించారు.  

ప్రత్తిపాటి చొరవ, సహకారం వల్లే ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు : ప్రభుత్వాసుపత్రి వైద్యులు..

స్థానిక నియోజకవర్గంతో పాటు.. చుట్టపక్కల నియోజకవర్గాల ప్రజల ఆరోగ్య సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేక చొరవ తీసుకొని అసుపత్రిని అన్నివిధాల అభివృద్ధి చేశారని ప్రభుత్వాసుపత్రి వైద్యులు తెలిపారు. ఆసుపత్రికి ఈ వసతులు కావాలి.... ఇన్ని నిధులు కావాలని తాము ఆయనకు చెప్పిన వెంటనే, ప్రభుత్వాన్ని సంప్రదించి వాటి మంజూరుపై దృష్టిపెట్టే వారని చెప్పారు. ఆయన సహాకారం లేకుంటే తాము రోగులకు ఉత్తమ సేవలు అందించలేకపోయేవాళ్లమని, నేడు కేంద్ర ప్రభుత్వ పురస్కారం లభించేది కాదని వారు అభిప్రాయపడ్డారు. ప్రత్తిపాటి నాయకత్వంలోనే 100 పడకల ప్రభుత్వాసుపత్రి 500 పడకలకు అప్ గ్రేడ్ అవ్వాలని ఆశిస్తున్నామని వైద్యులు తెలిపారు.

సమావేశంలో  చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా , మాజీ మున్సిపల్ చైర్మన్ రఫని , పార్టీ పట్టణ అధ్యక్షులు సమద్ ఖాన్  , చిలకలూరిపేట రూరల్ మండలం అధ్యక్షులు జువ్వాజి మదన్మోహన్ ,పట్టణ ప్రధాన కార్యదర్శి  మద్దు మాల రవి, నియోజకవర్గ యువత అధ్యక్షులు గడ్డినేని  సాయి , గవర్నమెంట్ హాస్పటల్ సూపర్డెంట్ , మురుకొండ మల్లిబాబు , మైనార్టీ నాయకులు బేరింగ్ మౌలాలి ,మచ్చ వెంకటేశ్వర్లు , పుల్లగూర భరత్ , నక్క నరసింహ , హాస్పటల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు పలువురు పాల్గొన్నారు.

COMMENTS

పేరు

Andhra Pradesh,18,CPT News,18,Guntur,2,health articles,86,Local News,18,national,8,Palanadu news,4,Palnadu News,4,pawan kalyan,1,Political,3,Telangana,1,
ltr
item
AP News Line: ప్రభుత్వాసుపత్రికి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు.. ప్రజారోగ్య పరిరక్షణలో కూటమిప్రభుత్వ పనితీరుకు నిదర్శనం : ప్రత్తిపాటి
ప్రభుత్వాసుపత్రికి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు.. ప్రజారోగ్య పరిరక్షణలో కూటమిప్రభుత్వ పనితీరుకు నిదర్శనం : ప్రత్తిపాటి
https://blogger.googleusercontent.com/img/a/AVvXsEi7whXvMFPe7a-7djHR2aaCoXaB-T3r4ikSl18kU06cVX4WbjRBrnqwYj39XGZzPJ5uglUkNZitz-wh5qjtHZoinDS9cgpCtCmW-AI6FPOwczauJY23_KhF_GG7VxlS5mvIuq7I0vb3qh73rI45x1wJC8BwAOL_6c7NN1-hFCPwwkFD2RG7MfYYqXOPqXg
https://blogger.googleusercontent.com/img/a/AVvXsEi7whXvMFPe7a-7djHR2aaCoXaB-T3r4ikSl18kU06cVX4WbjRBrnqwYj39XGZzPJ5uglUkNZitz-wh5qjtHZoinDS9cgpCtCmW-AI6FPOwczauJY23_KhF_GG7VxlS5mvIuq7I0vb3qh73rI45x1wJC8BwAOL_6c7NN1-hFCPwwkFD2RG7MfYYqXOPqXg=s72-c
AP News Line
https://www.apnewsline.com/2026/04/blog-post_82.html
https://www.apnewsline.com/
https://www.apnewsline.com/
https://www.apnewsline.com/2026/04/blog-post_82.html
true
8209592157698815989
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy