పల్నాడు: జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులన...
పల్నాడు: జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా పర్యాటక అభివృద్ధి సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నాగార్జునసాగర్, కొండవీడు, అమరావతి, కోటప్పకొండ వంటి ప్రాంతాల్లో చేపట్టిన పనులను వేగవంతం చేయాలన్నారు.
ముఖ్యంగా నాగార్జునసాగర్ హరిత రిసార్ట్స్ పునరుద్ధరణ, శ్రీశైలం బోటింగ్ సేవలను త్వరగా ప్రారంభించాలని సూచించారు. అమరావతి ధ్యాన బుద్ధ విగ్రహం వద్ద సౌండ్ అండ్ లైట్ షో మరమ్మత్తులు, కాలాచక్ర మ్యూజియం పునరుద్ధరణకు నిధులు సమీకరించాలని ఆదేశించారు. కొండవీడు ఘాట్ రోడ్డులో పర్యాటక వసతులు, నైట్ టెంట్స్ ఆపరేషన్ కొనసాగించాలని, ఎత్తిపోతల వద్ద జిప్‌లైన్ ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
పర్యాటక ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ అన్ని చోట్లా శానిటరీ కాంప్లెక్సులు నిర్మించాలని, యాత్రా కేంద్రాల్లో హోమ్‌స్టేలను అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో బాలకృష్ణ, పర్యాటక శాఖ అధికారి నాయుడమ్మ, ఏపీటీడీసీ అధికారులు మరియు వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
COMMENTS