చిలకలూరిపేట:పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో ప్రముఖ రియల్టర్ గుదే పాండురంగరావు సారధ్యంలో రూపుదిద్దుకుంటున్న హ్యాపీ హోమ్స్ డెవలపర్స...
చిలకలూరిపేట:పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో ప్రముఖ రియల్టర్ గుదే పాండురంగరావు సారధ్యంలో రూపుదిద్దుకుంటున్న హ్యాపీ హోమ్స్ డెవలపర్స్ వారి నూతన ప్రాజెక్ట్ 'ఎలైట్ ఎన్ క్లేవ్' శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకట కుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.శాస్త్రోక్తంగా జరిగిన భూమి పూజలో పాల్గొన్న అనంతరం, ఆమె ప్రాజెక్ట్ యొక్క అధికారిక బ్రౌచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకట కుమారి మాట్లాడుతూవినియోగదారుల నమ్మకానికి ప్రతీకగా నిలుస్తున్న గుదే పాండురంగరావు చిలకలూరిపేట ప్రజలకు మెరుగైన వసతులతో కూడిన నివాస స్థలాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు.
COMMENTS