చిలకలూరిపేట: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లార...
చిలకలూరిపేట: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పార్టీకి చేసిన సేవలను గుర్తించి రీజనల్ కో ఆర్డినేటర్ పదవిని కట్టబెట్టడం హర్షించదగ్గ విషయమని చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా శనివారం ప్రత్తిపాటి పుల్లారావుని నాయకులు, కార్యకర్తలు చిలకలూరిపేట పట్టణంలోని క్యాంప్ కార్యాలయం నందు కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. పుష్పగుచ్చాన్ని అందించి, దుశ్శాలువతో సత్కరించి, ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నాయకులందరి సమర్థ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అభివృద్ధికి విశేష కృషి జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు మరింత చేరువ అవుతూ, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే దిశగా నాయకత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ నియామకాలు పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చాయని, కార్యకర్తలకు మరింత ప్రేరణనిస్తాయని తెలిపారు.నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతాయని, ప్రజా సమస్యల పరిష్కారానికి సమర్థంగా ముందుకు సాగుతామని నాయకులు స్పష్టం చేశారు. ప్రత్తిపాటి పుల్లారావు నాయకత్వంలో పనిచేయడం తమకు గర్వకారణంగా ఉందని వారు తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జి డి సి సి బ్యాంకు చైర్మన్ మానం వెంకటేశ్వర్లు, యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, మండల పార్టీ అధ్యక్షులు జవ్వాజి మదన్, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబా, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ నాయకులు, తెలుగు మహిళలు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
COMMENTS