చిలకలూరిపేట:పట్టణంలోని పవన్ ఫ్లవర్ స్టాల్ & లైటింగ్ డెకరేషన్స్ అధినేత మామిడి శ్రీనివాసరావు, తన తండ్రి దివంగత మామిడి రాఘవయ్య ...
చిలకలూరిపేట:పట్టణంలోని పవన్ ఫ్లవర్ స్టాల్ & లైటింగ్ డెకరేషన్స్ అధినేత మామిడి శ్రీనివాసరావు, తన తండ్రి దివంగత మామిడి రాఘవయ్య జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చడానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. చలివేంద్రం ప్రారంభం అనంతరం అక్కడికి వచ్చిన ప్రజలకు ఆయన స్వయంగా మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.అనంతరం, మున్సిపాలిటీ పన్ను రాయితీపై అవగాహన కల్పించేలా శ్రీనివాసరావు విరాళంగా అందజేసిన 100 గోడ స్టిక్కర్ల (పోస్టర్ల)ను కమిషనర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు, రాయితీలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పవన్ ఫ్లవర్ స్టాల్ యాజమాన్యం ముందుండటం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆర్.ఐ అబ్దుల్ ఖాదర్, టిడిపి నాయకులు లెనిన్ బాబు, సుభాని తదితరులు ఉన్నారు.
COMMENTS