చిలకలూరిపేట మండలం దండమూడి గ్రామంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పధకం (ఎన్‌ఆర్‌ఈజీఏ) క్రింద జరుగుతున్న పని ప్రదేశాన్ని డైరెక్టర్ షన్మ...
చిలకలూరిపేట మండలం దండమూడి గ్రామంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పధకం (ఎన్‌ఆర్‌ఈజీఏ) క్రింద జరుగుతున్న పని ప్రదేశాన్ని డైరెక్టర్ షన్ముఖ్ కుమార్,ప్రాజెక్ట్ డైరెక్టర్ (డిజిటల్ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ) ఎం.సిద్ధలింగ మూర్తి, నరసరావుపేట క్లస్టర్ ఏపీడీ ఇ.బూషిరేడ్డి తిరిగి సందర్శించారు.ఈ రోజు ఉదయం 8 గంటలకు పని ప్రదేశానికి చేరుకున్న అధికారులు ఉపాధి కార్మికుల హాజరును పరిశీలించారు.ఎన్‌ఆర్‌ఈజీఏ యాప్ (ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్) ద్వారా హాజరు నమోదు చేయడంలో ఎదురవుతున్న సమస్యలను స్వయంగా పరిశీలించి,పరిష్కారాల కోసం సూచనలు చేశారు.కార్మికులు అందరూ పనిలో పాల్గొనేలా చూడాలని, పని ప్రదేశంలో కల్పించిన వసతులను (బీజాలు, నీరు, మంచం వంటివి) సరిగ్గా అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట ఎంపీడీవో,ఏపీవోతో పాటు ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.
COMMENTS