ప్రపంచం గర్వించే అత్యుత్తమ రాజ్యాంగాన్ని భారతావనికి అందించిన మహానీయుడు, ప్రపంచమేథావి, భారతరత్న, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ...
ప్రపంచం గర్వించే అత్యుత్తమ రాజ్యాంగాన్ని భారతావనికి అందించిన మహానీయుడు, ప్రపంచమేథావి, భారతరత్న, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, ఆయన ఆలోచనలే మనదేశాన్ని అన్నిదేశాలకు మేటిగా నిలిపాయని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.
అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ ఆద్వర్యంలో ఏర్పాటుచేసిన బైక్ ర్యాలీలో ప్రత్తిపాటి పాల్గొన్నారు. తన నివాసం నుంచి స్వయంగా బైక్ నడుపుతూ, స్థానిక సంజీవనగర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న ప్రత్తిపాటి, రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మార్వో కార్యాలయం వద్ద, కళామందిర్ కూడళ్లలోని అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించి, చివరిగా స్థానిక క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని, బాబాసాహెబ్ చిత్రపటానికి నివాళులర్పించారు. వేడుకల్లో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసిన ప్రత్తిపాటి.. ఎస్సీ సెల్ ఏర్పాటు చేసిన అన్నదానాన్ని ప్రారంభించి, ప్రజలకు అన్నవితరణ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా ఎన్టీఆర్, చంద్రబాబులు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారు.అంటరానితనం, కులవివక్షపై అంబేద్కర్ సాగించిన పోరాటమే సమసమాజ స్థాపనకు దోహదపడిందని ప్రత్తిపాటి చెప్పారు. అంబేద్కర్ రచనా నైపుణ్యం వల్లే నేడు భారతీయులందరూ స్వేచ్చ, స్వాతంత్ర్యాలతో సంతోషంగా జీవిస్తున్నారన్నారు. ఈ దేశంలో భిన్న పార్టీలు, భిన్న వాదనలు, విభిన్న మతాలున్నా.. భారతీయులంతా ఐక్యంగా ఉండటానికి కారణం అంబేద్కర్ రాజ్యాంగమేనన్నారు. డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలుచేస్తున్న ఏకైక పార్టీ దేశంలో తెలుగుదేశం ఒక్కటేనని ప్రత్తిపాటి చెప్పారు. ఆ మహానీయుడి ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా, ఆయన స్ఫూర్తితో నాడు స్వర్గీయ ఎన్టీఆర్, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు బడుగు, బలహీనవర్గాలకు అన్నివిధాల అండగా నిలిచారని, వారి ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి పాటుపడ్డారని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, కామినేని సాయిబాబు, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, రాష్ట్ర నాయకులు ఇనగంటి జగదీష్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ షేక్ రఫాని, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు అమరా రామదేవి, ముల్లా కరీముల్లా, మురకొండ మల్లిబాబు, కొత్త కోటేశ్వరరావు, గట్టినేని విజయ్ సాయి, ఎస్సీ సెల్ నాయకులు పంగులూరి వెంగల రాయుడు, కుల్లి చిన్నబాబు, మైల గణేష్, గణేష్, కొప్పుల జ్యోతి రత్న బాబు, జున్ను చిన్ను, పిల్లి లెనిన్, మాణిక్యాలరావు, మాజీ కౌన్సిలర్ లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
COMMENTS