చిలకలూరిపేట: పట్టణంలోని 26వ వార్డు నివాసి మీసాల సాయికుమార్ మహేష్ నూతన గృహప్రవేశ కార్యక్రమం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కా...
చిలకలూరిపేట: పట్టణంలోని 26వ వార్డు నివాసి మీసాల సాయికుమార్ మహేష్ నూతన గృహప్రవేశ కార్యక్రమం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రదాత మరియు యువ నాయకులు మండలనేని చరణ్ తేజ ముఖ్య అతిథిగా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి నూతన గృహాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మండలనేని చరణ్ తేజ మాట్లాడుతూ, ఒక సామాన్యుడు తన సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం ఎంతో అభినందనీయమని, సాయికుమార్ కుటుంబం ఈ నూతన గృహంలో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. చరణ్ తేజ రాకతో వార్డులో సందడి నెలకొంది, స్థానిక ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.ఈ వేడుకలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు మునీర్ హసన్, నాయకులు వెంకటస్వామి, కోటా సాంబ, అచ్చుకోలా వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు 26వ వార్డుకు చెందిన వీర మహిళలు, పెద్ద సంఖ్యలో జనసైనికులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సాయికుమార్ మహేష్ కుటుంబ సభ్యులు అతిథులను మర్యాదపూర్వకంగా సత్కరించి, కృతజ్ఞతలు తెలియజేశారు.
COMMENTS