గుంటూరు: న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎపిలాసెట్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ...
గుంటూరు: న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎపిలాసెట్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ అధ్యయన విభాగం ఉచిత శిక్షణ అందిస్తోంది. ఈ నెల 16న ప్రారంభమైన ఈ కోచింగ్ రెండు వారాలు పాటు అంటే మే నెల 2 వరకు కొనసాగనుంది. ఐదేళ్ల న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం లాసెట్ రాయబోతున్న అభ్యర్థులకు ఈ కోచింగ్ అందిస్తున్నామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ అధ్యయన విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్ విజయలక్ష్మి తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత శిక్షణ తరగతులుంటాయని తెలిపారు. కోచింగ్లో భాగంగా విషయ నిపుణులచే కోచింగ్ ఇవ్వడంతో పాటు మాదిరి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని లాసెట్ (ఐదేళ్ల కోర్సు) అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు న్యాయ విభాగపు అధ్యాపకులు డాక్టర్ సురేష్ చెన్నం, అభిలాష్ 99855 50331, 81423 77888 సంప్రదించాలని సూచించారు.
COMMENTS